పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు.. రాజాసాబ్, ఫౌజీ సినిమాతో బిజీ అయ్యాడు. మరోవైపు ప్రభాస్ హీరోగా నటించనున్న భారీ బడ్జెట్ సినిమా స్పిరిట్. ఈ సినిమాపై ఇప్పటికే విపరీతంగా హైప్ ఉంది. యానిమల్ సినిమాతో బ్లాక్‍బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ వంగా ఇప్పుడు ప్రభాస్‌తో కొత్త సినిమా రూపొందించనుండటంతో అద్భుతమైన బజ్ క్రియేట్ అయింది.
అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఇవాళ ఉగాది సందర్భంగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్‌ను డైరెక్టర్ సందీప్ వంగా అందించాడు. తాజాగా సందీప్ రెడ్డి వంగా సర్ ప్రైజ్ అందించాడు. ప్రభాస్ స్పిరిట్ మూవీ షూటింగ్ మెక్సికోలో జరగనుందని చెప్పారు. అమెరికాలో జరిగిన ఉగాది వేడుకలలో అతడు ఈ ట్రీట్ అందించాడు.
మెక్సికోలో షూటింగ్ లొకేషన్ల కోసం పరిశీలించామని అన్నారు. దీంతో సందీప్ రెడ్డి, ప్రభాస్ స్పిరిట్ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ మెక్సికోలో జరగనుందని తెలుస్తుంది. అంతేకాకుండా అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుందని అర్థం అయింది. ఈ సినిమా భారీ బడ్జెట్‍తో పాన్ హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని సమాచారం. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగా స్కిప్ట్ పనులను పూర్తిచేశాడు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఇది రొమాంటిక్ హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందది. మరోవైపు హను రాఘవపూడి దర్శత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాక.. స్పిరిట్‍ను ప్రభాస్ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.