Nandamuri Balakrishna: ఒక్క రోజులోనే ఫిక్స్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలయ్య

nandamuri-balakrishna

Nandamuri Balakrishna: వచ్చే నెలలో ఆదిత్య 369 సినిమా రి రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్‌ నిర్వహించారు. ఇందులో యువ రత్న బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, బాబీ పాల్గొన్నారు. వీరితో పాటు సినిమాలో కీలక పాత్రలో కనిపించిన బాబూ మోహన్, నిర్మాత హాజరయ్యారు. అందరూ ఈ సినిమాతో వారికి ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

ఆదిత్య 369 రిలీజ్ అయినప్పటి బాబీ, అనిల్ తమ వయసు ఎంతో బయటపెట్టారు. అసలు వారు మొదటిసారి ఈ సినిమాను ఎక్కడ చూశారో చెప్పారు. షూటింగ్ సమయంలో తను, బాలకృష్ణ కలిసి ఎంత అల్లరి చేశామో బాబూ మోహన్ గుర్తు చేసుకున్నారు.

బాలయ్య మాట్లాడుతూ.. ఆదిత్య 369 సినిమాను ఎంత కష్టపడి తెరకెక్కించారో గుర్తుచేసుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలు తీస్తున్న సమయంలోనే ఈ సినిమా ఆఫర్ వచ్చిందని, కొత్త కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనే నమ్మకంతోనే చేశానని తెలిపారు. సీక్వెల్‌కు ప్లానింగ్ అంతా ముగిసిందని, కేవలం ఒకే ఒక్క రోజులో కథను పూర్తి చేశామని, త్వరలోనే ప్రారంభిస్తామని గుడ్ న్యూస్ తెలిపారు.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు నేను నాలుగో, ఐదో చదువుతున్నాను. గుంటూరులో చూశాను. ఈ సినిమాని రీ-రిలీజ్ చేస్తున్న కృష్ణప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ తరం వారికి ఈ సినిమాని చూపించాలన్న ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. నేను బాలకృష్ణ గారితో రూపొందించిన ‘డాకూ మహరాజ్‌’ సినిమా కేరెక్టర్‌కి ఇన్‌స్పిరేషన్ ‘ఆదిత్య 369’. రీ రిలీజ్‌లో కూడా ఈసినిమా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది’’ అన్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ సినిమాని అద్దంకి శ్రీరామా థియేటర్‌లో చూశాను. అప్పుడు నాకు 9 సంవత్సరాలు. ఈ సినిమా వాల్ పోస్టర్ చూసి, బాగా ఆకర్షితుడణ్ణి అయ్యాను. సినిమా చూస్తుంటే ఇక మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలిగింది. ఆ క్లాసిక్‌ మూవీని ప్రింట్ నుంచి డిజిటల్‌కి తీసుకురావడం అద్భుతం. ఇలాంటి సినిమాలను సేవ్ చేయడం అవసరం. బాలకృష్ణగారు చెప్పినట్టు ఇది రీ-రిలీజ్ కాదు.. ప్రీ రిలీజ్.. అఖండ-2 ముందు ఇది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు.

తరవాత కథనం