Actress Genelia: 2003లో బాలీవుడ్ సినిమా తుఝే మేరీ కసమ్ తో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. ఈ మూవీతో జెనిలియా రితేష్ దేశ్‌ముఖ్ సరసన నటించింది. అదే ఏడాదిలో తమిళ చిత్రం “బాయ్స్”లో కూడా నటించింది. ఇదే సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. ఇక తెలుగులో ఈ భామ సత్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత సాంబ, నా అల్లుడు, సుభాష్ చంద్రబోస్, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, మిస్టర్ మేధావి, రెడీ, కథ, ఆరెంజ్, నా ఇష్టం వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. బొమ్మరిల్లు చిత్రం ఆమెకు విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. జెనీలియా 2012లో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది.
ఆ తర్వాత కొన్నాళ్లు దూరంగా ఉన్న జెనీలియా.. పదేళ్ల తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆ సమయంలో జరిగిన కొన్ని విషయాలను తాజాగా అందరితో పంచుకుంది. పదేళ్ల తర్వాత మళ్ళీ నటించాలని అనుకున్నప్పుడు, అంతా ప్రోత్సాహిస్తారని అనుకుంటే, ఊహించని విధంగా కొందరి నుంచి వచ్చిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధ పెట్టాయని తెలిపింది. ‘‘ఒక నటిగా నేను ఆరు భాషల్లో పని చేశాను.
కెరీర్ పరంగా, నటన పరంగా సక్సెస్, ఫెయిల్యూర్స్‌ని ఎప్పుడూ లెక్క చేయలేదు. కష్టం, సుఖం, జయాపజయాలు మన లైఫ్‌లో కామన్. అందుకే వీటన్నింటికంటే కూడా, మనం మన లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తున్నామనేదే ఇక్కడ ముఖ్యం. పెళ్లి, పిల్లలు తర్వాత ఇక యాక్టింగ్ వద్దని అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొనసాగించాలని అనుకున్నప్పుడు తెలిసిన వాళ్ళెవ్వరూ నన్ను ప్రోత్సహించలేదు. పదేళ్లు అవుతుంది.
ఇప్పుడు యాక్టింగ్ నీకు వర్కవుట్ కాదు అని అన్నారు. వారి మాటలు తీవ్ర నిరాశకు లోనయ్యేలా చేశాయి. అయినా కూడా ధైర్యంగా అడుగు వేశాను. రితేష్‌తో చేసిన ‘వేద్’ నాకు గ్రాండ్ రీ ఎంట్రీగా నిలబడింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే నేను అందరికీ ఒక విషయం చెప్పదలచుకున్నాను.
అన్ని విషయాలలో ఇతరులు మన గురించి చెప్పే విషయాలను నమ్మవద్దు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. సక్సెస్ దానంతట అదే వస్తుంది’’ అని జెనీలియా తెలిపింది.