Hair Serum:హెయిర్ సీరమ్ ట్రై చేయండి.. జీవితంలో తెల్లజుట్టు రాదు

Hair Serum:

Hair Serum For White Hair: ప్రస్తుతం కాలంలో వయసుతో సంబంధం లేకుండా నిండా 30 ఏళ్లు నిండకుండానే తెల్లజుట్టు సమస్యతో సతమతమవుతున్నారు. ఇక తెల్లజుట్టును కవర్ చేసేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఓ వైపు వైట్ హెయిర్‌ను తొలగించలేరు. మరోవైపు కెమికల్స్‌తో కూడిన హెయిర్ ఆయిల్స్, హెయిర్ డైలు, షాంపులు వాడలేరు. పైగా ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి జుట్టు హాని కలిగే ప్రమాదం ఉంది. అంతే కాదు వీటివల్ల భవిష్యత్తులో కంటి అనేకఅనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనం ఎంత  ఆరోగ్యంగా ఉంటే.. జుట్టు కూడా అంతే ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది. ఇందుకోసం తప్పనిసరిగా రోజూ వారి డైట్‌లో జుట్టుకు కేర్ తీసుకోవాల్సిందే.. ముఖ్యంగా సరైన ఆహారం తీసుకోవడంతో పాటు, ప్రతిరోజు వ్యాయామం చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకుంటే మంచిది. వీటన్నిటికి చెక్ పెట్టే మార్గం ఒకటి ఉంది. తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు ఈ హెయిర్ సీరమ్ ట్రై చేయండి. జీవితంలో తెల్లజుట్టును దరిచేరకుండా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు
కరివేపాకు
మెంతులు
బ్లాక్ సీడ్స్
వాటర్
మస్టర్డ్ ఆయిల్

తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో కరివేపాకు, మెంతులు, బ్లాక్ సీడ్స్, వాటర్ పోసి 10 నిమిషాల పాటు మరిగిచండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్ప్రే బాటిల్‌ కానీ గాజు సీసాలో వడకట్టుకోవాలి. అందులో మస్టర్డ్ ఆయిల్ కలపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పెట్టుకుని, కొద్దిసేపటి వరకు మసాజ్ చేసి, అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి రిజల్ట్ మీకు కమిపిస్తాయి. క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. ఈ హెయిర్ సీరమ్ వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

తరవాత కథనం