Arjun S O Vyjayanthi: దుమ్ము దులిపేసిన కళ్యాణ్ రామ్.. కొత్త సినిమా సాంగ్ హైలైట్!

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమా భారీ అంచనాలతో రూపొందుతోంది. ఇందులో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో పోషిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఆమె కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది.

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ తాజాగా ఈ మూవీ నుంచి సర్ప్రైజ్ అందించారు. ఇందులో భాగంగానే ఉషారెత్తించే సాంగ్ ను రిలీజ్ చేశారు. ” చుక్కల చీర చుట్టేసి గజ్జల పట్టీలు కట్టేసి చెంగమనే నువ్వట నడిచోస్తుంటే” అంటూ ఈ సాంగ్ సాగుతోంది.

ఇందులో కళ్యాణ్ రామ్, సాయి మంజ్రేకర్ తమ అదిరిపోయే స్టెప్పులతో దుమ్ము దులిపేశారు. నాయాల్ది అంటూ సాగే ఈ సాంగ్ ఫుల్ జోష్లో సాగుతోంది. కెవ్వుమనిపించే స్టెప్పులతో ఇరగదీసేసారు. యూత్ ఎలాంటి స్టెప్పులను ఇష్టపడతారో అలాంటి కొరియోగ్రఫీ అందించి ఫుల్ హైప్ పెంచేసారు.

అజనీష్ లోకనాథ్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. రఘురాం లిరిక్స్ అందించగా నకాష్ అజీజ్ పాడి హోరెత్తించాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.

తరవాత కథనం