MI Vs KKR: ముంబయి ఘనవిజయం.. కెకెఆర్ చిత్తు చిత్తు!

ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బోని కొట్టింది. తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొదటి రెండు మ్యాచ్లు పరాజయంపాలు కాగా మూడో మ్యాచ్ లో చెలరేగిపోయింది.

కోల్కతాను చిత్తుచిత్తుగా ఓడించింది. ముంబై అరంగేట్ర పేసర్ అశ్వని కుమార్ తన అద్భుతమైన బౌలింగ్ తో కోల్కతా బ్యాటర్ల కు చెమటలు పట్టించాడు. అతనికి మిగతా బౌలర్లు తోడు కావడంతో కోల్కతాను అది తక్కువ పరుగులకే కట్టడి చేశారు.

మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా ఘోరంగా విఫలమైంది. ముంబై బౌలింగ్ కు చేతులెత్తేసింది. ఏ ఒక బ్యాటరు క్రీజ్ లో ఎక్కువ సమయం నిలబడలేకపోయాడు. వచ్చిన ప్రతి బ్యాటర్ పెవిలియన్ బాట పట్టాడు. ఇలా మొత్తంగా కోల్కత్తా జట్టు 116 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ముంబై జట్టు అలవోకగా చేదించింది.

ఓపెనర్ రికిల్టన్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ప్రత్యర్థి జట్టుకు చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్స్ లు కొడుతూ స్టేడియంలో హోరెత్తించాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. అతడికి సూర్య కుమార్ యాదవ్ తోడు నిలిచాడు. 9 బంతుల్లో 27 పరుగులు చేసాడు. దీంతో ముంబై ఇండియన్స్ 12.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

తరవాత కథనం