salman khan: టాలీవుడ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సల్మాన్ ఖాన్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. అతడు చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్స్ ను అందుకుంటుంది. దీంతో అతడికి హిట్టు పడి చాలా కాలం అయింది. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల సికిందర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలైంది.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం సల్మాన్ ఖాన్ కు మంచి కంబ్యాక్ ఇస్తుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను ఈ సినిమా తలకిందులు చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ అందుకుంది.

కలెక్షన్ల సైతం ఆశించినంతగా రాలేదు. ఇలా ఈ సినిమా కూడా బెడిసి కొట్టడంతో సల్మాన్ తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగానే టాలీవుడ్ దర్శకుడుతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. గతేడాది మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ చిత్రం రైడ్ కు రీమేగా తెరకెక్కిన ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం కనీసం 20 శాతం కూడా వసూళ్లను రాబట్లేకపోయింది. దీంతో ఓవైపు హీరోగా సక్సెస్ అయ్యేందుకు సల్మాన్ ఖాన్, మరోవైపు దర్శకుడిగా హిట్టు కోసం హరిశంకర్ చూస్తున్నారు.

ఇప్పుడు వీరిద్దరూ ఒకటై బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబో చిత్రానికి టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ చక్కర్లు కొడుతుంది. చూడాలి మరి ఇందులో నిజం ఎంత ఉందో.

తరవాత కథనం