యూరిక్ యాసిడ్ సమస్య ఈ రోజుల్లో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ యాసిడ్ ఒక రకమైన వ్యర్థపదార్థం. ఇది ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటుంది. ప్యూరిన్లు దాని పెరుగుదలకు ముఖ్య కారణం. అవి విచ్ఛిన్నం అయినప్పుడు కీళ్లలో ప్రవేశించడం ప్రారంభిస్తాయి. దీనిని అధిక యూరిక్ యాసిడ్ అంటారు. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు, గౌట్ సమస్యలు, ఇతర తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం కావచ్చు. అధిక యూరిక్ యాసిడ్ పరిస్థితిని హైపర్యూరిసెమియా అని కూడా అంటారు. అధిక యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు.. మూత్రం మనకు మొదటి సూచనను ఇస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ సులభంగా గుర్తించవచ్చు. అధిక యూరిక్ యాసిడ్ సంకేతాల గురించి డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
మూత్రంలో కనిపించే 3 మార్పులు
1. మూత్రం ముదురు రంగు
అధిక యూరిక్ యాసిడ్ వల్ల మూత్రం ముదురు రంగులో.. అంటే పసుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా యూరిక్ యాసిడ్‌ని ఒకసారి పరీక్షించుకోవాలి.
2. మూత్రంలో దుర్వాసన
మీ మూత్రంలో దుర్వాసనను గమనించినట్లయితే.. మీ యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ.. చెడు వాసన కలిగిన మూత్రం అనేక ఇతర వ్యాధుల సంకేతంగా కూడా ఉంటుంది.
3. మూత్రంలో నురుగు
ఎల్లప్పుడూ మీ మూత్రంలో నురుగు, బుడగలు కనిపిస్తుంటే.. ఇది కూడా అధిక యూరిక్ యాసిడ్‌కు సంకేతం కావచ్చు. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల మూత్ర విసర్జనకు సంబంధించిన అత్యంత సాధారణ లక్షణాలు ఇవేనని వైద్యులు చెబుతున్నారు.
హెమటూరియా పరిస్థితి ఏమిటి?
హెమటూరియా విషయంలో.. మూత్రంలో రక్తాన్ని కూడా కనుగొనవచ్చు. వాస్తవానికి.. అధిక యూరిక్ యాసిడ్ కారణంగా.. వాపు, స్ఫటికాలు మూత్రపిండాలు లేదా మూత్ర నాళంలో పేరుకుపోతాయి. ఇది ఈ పరిస్థితికి కారణమవుతుంది.
యూరిక్ యాసిడ్ నివారణకు చర్యలు
ఈ సమస్యలకు హోం రెమెడీ చాలా సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. దీని కోసం పసుపు, కొత్తిమీర, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి అవసరం. ఈ వస్తువులన్నింటినీ 2 కప్పుల నీటిలో వేసి మరిగించాలి. రోజూ ఉదయాన్నే ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిఫై అవుతుంది. అనంతరం యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.
దీనితోపాటు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయండి. అలాగే సరైన మోతాదులో నీరు తాగాలి. ఈ సమస్యతో బాధపడుతున్న వారు నిమ్మరసాన్ని వీలైనంత తక్కువగా తీసుకోవాలి.