Papaya Face Packs: బొప్పాయి ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఫేస్ ప్యాక్ వల్ల అందం రెట్టింపు అవడంతో చర్మం మెరుస్తూ.. ఆరోగ్యంగా ఉంటుందట. అందమైన, పట్టులాంటి మెరిసే చర్మం కోసం బొప్పాయిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బొప్పాయిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి కావాల్సినంత తేమను అందిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు చర్మంపై తేమను ఉంచడంలో అద్బుతంగా పనిచేస్తాయి. బొప్పాయిని చర్మానికి అప్లై చేయం వల్ల చర్మంపై పగుళ్ల సమస్య రాదు. బొప్పాయిలో బీటా-కెరోటిన్, విటమిన్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మచ్చలు, స్కిన్ పిగ్మెంటేషన్‌ను, మొటిమలను తొలగించడంలో చక్కగా పనిచేస్తాయి.
బొప్పాయిలో పుష్కంలంగా దొరికే విటమిన్ ఏ మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. బొప్పాయి చర్మానికి మంచి మాయిశ్చరైజర్ కూడా. ఇది చర్మం సహజ తేమను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ మొటిమల మచ్చలు, మోచేతులు, మోకాళ్లపై వంటి నల్లటి చర్మపు మచ్చలను ఈజీగా తొలగిస్తుంది.
చర్మం దురద, ఎరుపుదనాన్ని తగ్గించడంతో బొప్పాయి తోడ్పడతాయి. బొప్పాయిలో మొక్కల ఆధారిత యాంటీఆక్సిడెంట్‌లు అధికంగా ఉంటాయి. ఇవి ముఖంపై మృతకణాలను తొలగించి.. ఫేస్ తాజాగా, యవ్వనంలా ఉండేలా సహయపడుతుంది బొప్పాయి గుజ్జుతో ఎక్స్‌ఫోలియేట్ చేసుకుంటే చర్మంపై మురికి మొత్తం పోయి చాలా క్లీన్ గీ కనబడుతుంది.
బొప్పాయిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బొప్పాయి తింటే చర్మం మృదువుగా, యవ్వనంగా మారుతుంది. ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. బొప్పాయి గుజ్జుతో ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి.
బొప్పాయి గుజ్జు, తేనె కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఈ ప్యాక్‌ను క్రమంతప్పకుండా వాడితే ముఖంపై అవాంచిత రోమాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి పటట్టిపాలు కలిపి ఫేస్ ప్యాక్ ట్రై చేసిన మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మంపై మృతకణాలను తొలగించి కాంతివంతంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.