Beauty Tips: అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.. అందులోనూ యంగ్ ఏజ్‌లో ఉండే ఆడవాళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హోమ్ రెమిడీస్, బ్యూటీ పార్లర్, బ్యూటీ ప్రోడెక్ట్స్ ఒక్కటేంటి.. అందాన్ని పెంచేవి ఏమైనా సరే ఉపయోగిస్తారు. అయితే ఎప్పుడూ బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడం కంటే.. ఇంట్లో కూడా మనం ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. పెద్దగా ఖర్చు కూడా ఉండదు.
అందులోనూ ఇది సమ్మర్ సీజన్.. ఈ కారంలో చర్మాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. కాబట్టి ఇంట్లోనే నాచురల్ గా ఉఫేస్ ప్యాక్ లు ట్రై చేశారంటే.. మంచి ఫలితం ఉంటుంది. అందంగా కనిపిస్తారు కూడా. రెండు, మూడు రోజుల మెరుపును తీసుకొచ్చే ఫేషియల్స్ కంటే.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మెరుపును, రంగును పెంచే కొన్ని హోమ్ మేడ్ బ్యూటీ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ టిప్స్ రాత్రి నిద్రపోయే ముందు ట్రై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ట్యానింగ్ చేసుకోండి:
ట్యానింగ్ అంటే.. ముఖంపై ఉండే మురికిని పోగొట్టుకోవడం. ఇందు కోసం మీరు ట్యాన్ రిమూవర్ కోసం.. పచ్చి పాలను ముఖానికి కాటన్ క్లాత్ తో రుద్ది క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకు పోయిన మురికి పోతుంది. ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం ఉదయం వరకు మెరుస్తూ కనిపిస్తుంది.
పాలు – రోజ్ వాటర్:
బయట క్రీమ్స్ వద్దు అనుకునేవారు ఇంట్లో కూడా చర్మాన్ని మెరిపించే క్రీమ్స్ ఉన్నాయి. కొద్దిగా పాలలో రోజ్ వాటర్, అలోవెరా జెల్ కలపండి. దీన్ని ఇప్పుడు ముఖానికి పట్టించి.. చేతితో మసాజ్ చేసి.. ఓ పది నిమిషాలు ఉంచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేస్తే.. ముఖంపై మృతకణాలు తొగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.
బియ్యం పిండి:
చర్మంపై ఉండే మురికిని వదిలించడంతో పాటు చర్మాన్నిమెరిసేలా చేయడంలో బియ్యం పిండి, శనగ పిండి చక్కగా పని చేస్తాయి. ఏదో ఒకటి తీసుకుని ఇందులో కొద్దిగా పెరుగు, టమాటా గుజ్జు కలిపి ముఖానికి అప్లై చేయండి. పది నిమిషాలు ఉంచి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. రాత్రి బాగా నిద్ర పోవాలి. ఇలా చేస్తే ఉదయం వరకు మీ ముఖం మెరిసి పోతుంది.
ముల్తానీ మట్టి:
ముల్తానీ మట్టి కూడా చర్మాన్ని మెరిసేలా చేయండంలో, చర్మంపై ఉండే మురికిని తొలగిస్తుంది. కొద్దిగా ముల్తానీ మట్టి, పాలు, గంధం పొడి, తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. చర్మాన్ని తడి చేసి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి. చేతులు, కాళ్లపై కూడా రాసుకోవచ్చు. ఓ పావుగంట ఉంచి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి.