salaar re-release collections: ‘సలార్’ రీ రిలీజ్ కలెక్షన్ల జోరు.. తొలిరోజే హయ్యెస్ట్ ఓపెనింగ్స్!

ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగానే మార్చి 21న ప్ర‌భాస్ స‌లార్ మూవీ రీ రిలీజైంది. ఆ సమయంలోనే మ్యాడ్ స్క్వేర్‌, రాబిన్‌హుడ్ లాంటి కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఆ సినిమాలతో పాటే రీరిలీజ్ అయిన సలార్ బాక్సాఫీసు వద్ద అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది.

రీ రిలీజ్‌లో అదిరే జోరు

రీ రిలీజ్‌లోనూ స‌లార్ బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేసింది. ఈ మూవీ ఓవ‌రాల్‌గా రూ.4.35 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది. తొలిరోజునే సలార్ మూవీ రూ.3 కోట్ల 20 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దీంతో తెలుగు రీరిలీజ్ సినిమాల్లో మొదటి రోజే హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్‌ రాబ‌ట్టిన సినిమాగా ప్రభాస్ స‌లార్ రికార్డ్ సృష్టించింది. ఇక  రెండో రోజు నుంచి థియేటర్లు తగ్గించారు. అయినా వసూళ్ల వరద మాత్రం ఆగలేదు.

ఇలా మొత్తంగా ప్రభాస్ సలార్ సినిమా థియేట్రికల్ రన్ అనంతరం భారీ వసూళ్లను సాధించినట్లు తెలిసింది. దాదాపు రూ. 4.35 కోట్ల గ్రాస్‌తో తెలుగు రీరిలీజ్ చిత్రాల్లో హ‌య్యెస్ట్ వసూళ్లను రాబ‌ట్టిన చిత్రంగా సలార్ నిలిచింది.

ఏడో చిత్రం

ఈ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇది క‌న్న‌డ ‘ఉగ్ర‌మ్‌’కు రీమేక్‌గా తెర‌కెక్కింది. దాదాపు రూ. 700 కోట్ల భారీ వసూళ్లను సాధించి ప్రభాస్‌కు మంచి కంబ్యాక్ అందించింది. అంతేకాకుండా 2023లో టాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా సలార్ నిలిచింది. ఇది మాత్రమే కాకుండా ఇండియా వైడ్‌గా హ‌య్యెస్ట్ వసూళ్లు సాధించిన 7వ సినిమాగా ఈ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది.

తరవాత కథనం