Brisk walking: ఆరోగ్యమైన గుండె కోసం ప్రతిరోజూ ఎంతసేపు నడవాలో తెలుసా?.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

గుండె సురక్షితంగా ఉంటే ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది. అందువల్లే చాలా మంది వ్యాయామాలు, యోగా, జిమ్ వంటివి చేస్తుంటారు. మనిషి బతికడానికి మూలం గుండె. ఆ గుండె కొట్టుకోవడం ఆగిపోతే.. మనం చనిపోతాం. కాబట్టి జీవితంలో ఎంత కష్టపడి పని చేసినా గుండెను మాత్రం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఖచ్చితంగా సమయం కేటాయించాలి. అందులో నడక గుండెకు ఉత్తమ వ్యాయామంగా పరిగణించబడుతుంది.

అయితే ప్రతిరోజూ ఎంతసేపు నడవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది?.. ఎంత వేగంతో నడవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వైద్యుల ప్రకారం.. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. వారానికి 200 నిమిషాలు చురుకైన నడక చేయాలి అంటున్నారు. 200 నిమిషాలు అంటే వారానికి 5 రోజులు 40 నిమిషాలు చురుకైన నడక చేయాలి అని చెబుతున్నారు. ఇందులో 5 నిమిషాల వార్మప్, 5 నిమిషాల కూల్-డౌన్ వంటివి చేయాలి. ఇంత సమయం కేటాయిస్తే ఆరోగ్యం, గుండె హెల్తీగా సురక్షితంగా ఉంటుంది.

ఎంత వేగంతో నడవాలి?

గుండె ఆరోగ్యం కోసం మీరు బ్రిస్క్ వాకింగ్ చేయాలి. బ్రిస్క్ వాకింగ్ అంటే నడిచేటప్పుడు.. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ వాక్యాలు మాట్లాడలేరు. గంటల తరబడి చాటింగ్ చేస్తూ నడవకూడదు. మాట్లాడటంలో ఇబ్బంది పడే విధంగా జాగింగ్ చేయాలి. ఇప్పుడు ఈ వేగం వివిధ వయసుల వారికి భిన్నంగా ఉంటుంది.

జిమ్‌లో వ్యాయామం చేయడం గుండెకు మంచిదా?

జిమ్‌లో వ్యాయామం చేయడం గుండెకు మంచిది కాదని వైద్యులు అంటున్నారు. ఇది గుండె ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలను తీసుకురాదు. శరీర బరువు కాకుండా ఇతర బరువులను ఎత్తి వెయిట్ ట్రైనింగ్ చేసినప్పుడు, అది కండరాలను పెంచుతుంది. కానీ కొన్నిసార్లు భారీ బరువులు ఎత్తడం లేదా ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులుగా గుండెపోటు ప్రమాదం అకస్మాత్తుగా పెరుగుతుంది.

గుండెకు ఉత్తమ వ్యాయామం ఏంటి?

గుండెకు ఉత్తమ వ్యాయామాల గురించి వైద్యుల ప్రకారం.. బ్రిస్క్ బాక్సింగ్, ఏరోబిక్స్, ఈత, సైక్లింగ్, పరుగు మంచి వ్యాయామాలుగా పరిగణించబడతాయి. ఇది గుండెను బలపరుస్తుంది. గుండెకు రోజువారీ నడక సరిపోతుంది. ప్రతిరోజు 40 నిమిషాల కంటే ఎక్కువ బ్రిస్క్ వాక్ చేస్తే, అది మీ బరువు తగ్గడానికి లేదా కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది.

తరవాత కథనం