శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు, ఖనిజాలు కలిగిన ఆహారం చాలా అవసరం. ముఖ్యంగా ప్రతి మనిషికి విటమిన్ బి12 అనేది బాడీకి సరిపడేంత ఉండాలి. ఒకవేళ బాడీలో విటమిన్ B-12 లోపం ఉంటే మనిషి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు నిండుగా ఉంటాయి. ఇది ఎప్పుడైతే శరీరానికి సరిపడేంత ఉంటుందో.. అప్పుడే కండరాలు, ఎముకలు, చర్మం, జుత్తం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా రక్తహీనతను తొలగించడానికి ఈ విటమిన్ చాలా అవసరం. అందువల్ల విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నవారు.. తమ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే చాలా హెల్దీగా ఉండొచ్చు.
విటమిన్ B-12 లోపాన్ని పెరుగు తినడం ద్వారా భర్తీ చేయవచ్చు. పాల ఉత్పత్తులు దాని లోపాన్ని తీర్చడంలో సహాయపడతాయని చాలా మంది ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఒక్క పెరుగుతోనే కాకుండా.. ఆ పెరుగులో మరిన్ని పదార్థాలు కలిపి తీసుకోవచ్చని కూడా చెబుతున్నారు.
విటమిన్ B-12 ప్రాముఖ్యత
విటమిన్ B-12 ప్రతి ఒక్కరి శరీరంలో చాలా ముఖ్యమైనది. ఈ విటమిన్ సహాయంతో మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. విటమిన్ B-12 శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల రక్తహీనత, నాడీ వ్యవస్థ, అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా రావచ్చు. ఇది డైటరీ విటమిన్. దీన్ని మనం రోజూ ఆహారం ద్వారా తీసుకోవాలి.
పెరుగు విటమిన్ B-12 ను ఎలా పెంచుతుంది?
విటమిన్ బి-12 లోపాన్ని నివారించాలంటే పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి. పెరుగు కూడా పాల ఉత్పత్తే కాబట్టి దాన్ని తీసుకున్నా ఏం పర్వాలేదు. ఎండాకాలంలో పెరుగు, మజ్జిగ, లస్సీలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మంచి బ్యాక్టీరియా, విటమిన్ సికి కూడా మూలం. శరీరంలో విటమిన్ బి-12 మొత్తాన్ని పెంచడంలో విటమిన్ సి కూడా పాత్ర పోషిస్తుంది.
పెరుగు ప్రయోజనాలు
పెరుగు ఒక సూపర్ ఫుడ్. అందువల్ల శరీరంలో విటమిన్ B-12 తగినంత మొత్తంలో పొందాలనుకుంటే.. పెరుగుతో కొన్ని ఆహారాలను కలిపి తినవచ్చు. ఇలా ఇతర పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే ఆరోగ్యంగా ఉంటారు. పెరుగులో ప్రోబయోటిక్స్, లాక్టోబాసిల్లస్, బైఫిడోబాక్టీరియా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
పెరుగుతో ఈ 3 పదార్థాలు
బాదం, జీడిపప్పు, వాల్‌నట్ వంటి డ్రై ఫ్రూట్స్‌ను పెరుగుతో కలిపి తినవచ్చు. బాదం, పెరుగు కలయిక ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. అందువల్ల పెరుగు, బాదంపప్పులను క్రమం తప్పకుండా తినవచ్చు. దీని రుచి కూడా బాగుంటుంది. దీన్ని తినడం వల్ల విటమిన్ బి-12 అందుతుంది. అలాగే చర్మం, జుట్టు, కంటి చూపు మెరుగుపడుతుంది.