Aditya 369: మళ్లీ థియేటర్లలోకి బాలయ్య క్లాసిక్ మూవీ ఆదిత్య 369

Aditya 369

Aditya 369: టాలీవుడ్ ఆడియెన్స్ మళ్లీ టైమ్ ట్రావెల్ చేసే టైమొచ్చేసింది. ఆదిత్య 369 మూవీ రీ-రిలీజ్‌కి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకొన్ని గంటల్లోనే.. 4K రెజల్యూషన్‌లో థియేటర్‌లో బొమ్మ పడబోతోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా.. 34 ఏళ్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. కేవలం.. హాలీవుడ్‌కి మాత్రమే పరిమితమైన సైన్స్ ఫిక్షన్ సబ్జెక్ట్‌ని.. తెలుగు ప్రేక్షకుల అద్భుతమైన వినోదం పంచేలా ఈ సినిమా తీశారు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. సినిమా వచ్చి 34 ఏళ్లవుతున్నా.. ఆదిత్య 369 మూవీకి ఉన్న క్రేజే వేరు. సినిమా రిలీజై 3 దశాబ్దాలు దాటినా.. ఇప్పటికీ టీవీలో చూసేందుకు, ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు ఆడియెన్స్ ఇష్టపడుతుంటారంటే.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్ అయిందో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు.

1991లో రిలీజైన ఈ సినిమా.. అద్భుతమైన కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, కాస్టింగ్ కారణంగా.. ఓ క్లాసిక్‌గా నిలిచింది. టాలీవుడ్ ప్రేక్షకులు అంతకుముందెప్పుడూ చూడని సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాకు భారీ లాభాలు దక్కాయి. ఎవరి ఊహకు అందని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ని.. చాలా సింపుల్‌గా ప్రేక్షకులకు అర్థమయ్యేలా తీశారు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. 30 ఏళ్ల కిందట టాలీవుడ్‌లో సై-ఫై సినిమాలు వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి టైమ్‌లో ఆదిత్య 369 రిలీజైంది.

ఆడియెన్స్‌నే కాదు ఇండస్ట్రీకి కూడా మైండ్ బ్లో చేసింది. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో.. ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసింది. బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులు కూడా ఆదిత్య 369 మూవీని పదుల సార్లు చూసుంటారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకు వచ్చిన గొప్ప సినిమాల లిస్ట్ తీస్తే.. అందులో కచ్చితంగా ఈ సినిమా ఉంటుంది. అలాంటి సినిమాని.. ఎప్పుడెప్పుడు రీ-రిలీజ్ చేస్తారా? అని ఇన్నాళ్లూ ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సినిమా రీ-రిలీజ్ అవుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది.

టైమ్ ట్రావెల్ చేసి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి వెళ్లడం, 500 ఏళ్ల కిందటి పరిస్థితులు ఎలా ఉంటాయో చూపించడం, తర్వాత ఫ్యూచర్‌కు ప్రయాణించడం.. భవిష్యత్తులో మానవుల జీవనశైలి ఎలా ఉంటుందో చూపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్‌కి.. ఓ డైమండ్‌తో కనెక్షన్‌ని లింక్ చేసిన విధానం.. ఆడియెన్స్‌కి సినిమాతో ట్రావెల్ అయ్యేలా చేసింది. అందువల్ల.. ఆదిత్య 369 మూవీ రీ-రిలీజ్.. ఇప్పుడో అద్భుతమైన అనుభూతి అనే చెప్పాలి.

ది టైమ్ మిషన్ అనే నవల ఆధారంగా.. ఆదిత్య 369 సినిమా తీశారు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. అందుకు తగ్గట్లుగానే కథనం కూడా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఇళయరాజా మ్యూజిక్ ఈ సినిమాకు మరో హైలెట్. శ్రీకృష్ణదేవరాయల సెట్, టైమ్ మెషీన్ ఎపిసోడ్స్.. అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా గనక ఇప్పుడు వచ్చి ఉంటే.. బాక్సాఫీస్ బద్దలైపోయేదనే టాక్ కూడా ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీతో కంప్లీట్‌గా అప్‌గ్రేడ్ చేసి.. రీ రిలీజ్ చేస్తుంటే.. చాలా మంది ప్రేక్షకులకు ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇదో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా చెబుతున్నారు.

తరవాత కథనం