Glowing Skin Tips: ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలని, ముఖంపై మొటిమలు, మచ్చలు లేకుండా కాంతివంతంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. బయట ఎండ, కాలుష్యం, దుమ్మూ, ధూళి వల్ల చర్మం కమిలి పోవడం, రంగు మారిపోవడం, మచ్చలు, మొటిమలు రావడం వంటివి వచ్చేస్తుంటాయి. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల ఫేసియల్స్ , మార్కెట్లో దొరికే క్రీములు, బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీటివల్లన ఫలితం ఉంటుందో లేదో పక్కన పెడితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మెరిసే చర్మాన్ని పొందడం అంతుచిక్కని రహస్యం కాదు.. లోతైన సైన్స్ అసలే కాదు. మీరు కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే చాలు..మీరు కోరుకున్న అందాన్ని మీరు సులభంగా పొందవచ్చు. మీ చర్మానికి పట్టులాంటి మెరుపు, మెరుగైన అందంతో కనిపించేలా మార్చే ఇలాంటి ఇంటి చిట్కాలను తప్పక పాటించండి. మెరుగైన ఆరోగ్యం, అందం కోసం మీరు మీ ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలను ఎక్కువగా చేర్చుకోవటం ఉత్తమం. వీటితో పాటు ఇంట్లోనే నాచురల్ గా కొన్ని టిప్స్ పాటిస్తే.. మంచి ఫలితం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
శెనగపిండి
బియ్యంపిండి
పెరుగు
టమోటా గుజ్జు
పొటాటొ రసం
తయారు చేసుకునే విధానం
ముందుగా చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ శెనగపిండి, రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి, టీ స్పూన్ పెరుగు, టీ స్పూన్ పొటాటో రసం, టీ స్పూన్ టమోటా గుజ్జు కలిపి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.
ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలు, ముడతలు, మొటిమలు తగ్గిపోయి చాలా అందంగా, యవ్వనంగా, ముఖం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. ఇందులో ఉపయోగించే పదార్ధాల వల్ల చర్మానికి ఎలాంటి హానికలగదు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.