Shubman Gill: విరాట్ కోహ్లీకి కౌంటర్ వేసిన శుభమన్ గిల్.. ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ ఘనవిజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఆర్సిబి ని సొంత మైదానంలోనే మట్టిగరిపించింది. దీంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ 4లోకి దూసుకెళ్లింది.

ఇక ఈ ఐపీఎల్ 2025 సీజన్లో ఎంతో ఘనంగా ప్రారంభించిన బెంగుళూరుకు సొంత గడ్డపైనే ఊహించిన షాక్ తగలడంతో అభిమానులు నిరాశ చెందారు. ఇదిలా ఉంటే గుజరాత్ మ్యాచ్ గెలిచిన అనంతరం శుభమన్ గిల్ ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అది నెట్టెంటా వైరల్ గా మారింది. ఆ పోస్ట్ పై నేటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరికొందరైతే గిల్ పోస్టుపై మండిపడుతున్నారు.

గిల్ పోస్టులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరు వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్ లో మొదట ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆడింది. ఆ తర్వాత గుజరాత్ జట్టు లక్ష్య చేదనకు దిగింది. ఓపెనర్ గా గిల్ ఆడుతూ ఒక్కసారిగా అవుట్ అయ్యాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఉత్సాహంలో మునిగిపోయాడు. కానీ ఈ మ్యాచ్ ను గుజరాత్ జట్టు సొంతం చేసుకుంది.

అనంతరం గిల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ” మేం గేమ్ పై మాత్రమే ఫోకస్ పెడతాం. శబ్దం మీద కాదు” అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చాడు. దీనిపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లీ చేసిన దానికి గిల్ కౌంటర్ ఇచ్చాడు అంటూ కామెంట్లలో రాసుకొస్తున్నారు.

మరొకరు.. ఫస్ట్ నువ్వు భారత్ తరపున టి20 లో స్థానం సంపాదించుకో ఆ తర్వాత ఇలాంటి పోస్టులు పెట్టు అని రాసుకొచ్చారు. ఎక్కువమంది గిల్ విరాట్ కోహ్లీకి కౌంటర్ ఇచ్చాడనే కామెంట్లు చేస్తున్నారు.

తరవాత కథనం