jack trailer: ‘జాక్’ ట్రైలర్ అదిరిపోయింది మచ్చా.. సిద్దూ రొమాన్స్ హైలైట్!

సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిజె టిల్లు సినిమాతో స్టార్ట్ క్రేజ్ అందుకున్నాడు. ఈ సినిమాలో అతడి యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత సీక్వెల్ తో కూడా అందరిని అలరించాడు. ఇప్పుడు మరో కొత్త జానర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య ఫిమేల్ లీడ్ లో నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10 న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో విడుదల తేదీ దగ్గర పడడంతో మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ అందించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే కామెడీ తో పాటు స్టోరీ కూడా బలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్యకు మంచి రోల్ అందునట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో సిద్దు తన మార్క్ చూపించాడు. అదిరిపోయే డైలాగులతో దుమ్ము దులిపేసాడు. ఓవరాల్ గా ఈ ట్రైలర్ పిచ్చ మాస్ గా ఉంది. చూడాలి మరి సినిమా ఎలా ఉంటుందో.

తరవాత కథనం