Hair Spa: హెయిర్ స్పా అనేది జుట్టుకు కొత్త మెరుపును ఇచ్చే చికిత్స అని చెప్పవచ్చు. తరచుగా హెయిర్ స్పా చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఈ కారణంగానే చాలా మంది మహిళలు నెలలో రెండు నుండి మూడు సార్లు హెయిర్ స్పా చేయించుకోవడానికి ఇష్టపడతారు.
హెయిర్ స్పా చేసేటప్పుడు షాంపూ, హెయిర్ క్రీమ్, హెయిర్ మాస్క్ , కండిషనర్ మొదలైన వాటిని అప్లై చేయడం ద్వారా మీ జుట్టుకు డీప్ మాయిశ్చరైజింగ్ అందుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో అందించే ఆవిరి వల్ల కూడా జుట్టు మెరిసిపోతుంది.
హెయిర్ స్పా జుట్టుకు అనేక ప్రయోజనాలను అందించినప్పటికీ.. హెయిర్ స్పాను పదే పదే చేస్తే అది జుట్టుకు చాలా నష్టం కలిగిస్తుంది. హెయిర్ స్పా చేసుకునే ముందు తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోండి.
జుట్టు రాలే సమస్య పెరుగుతుంది:
మీరు తరచుగా హెయిర్ స్పా చేసుకుంటే మాత్రం జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. ఈ సమస్య ఎక్కువగా తల చర్మం సున్నితంగా ఉండే వ్యక్తులలో వస్తుంది. సున్నితమైన స్కాల్ప్ ఉన్నవారికి కొన్ని రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ సెట్ అవ్వవు. కాబట్టి.. హెయిర్ స్పా చేయించుకుంటుంటే.. మీరు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఉండటానికి ఒకసారి ప్రొడక్ట్స్ రివ్యూ చెక్ చేయండి.
తలకు హాని:
హెయిర్ స్పా కోసం ఎక్కువ రసాయనాలు కలిగిన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇలాంటి సమయంలో మీకు వీటి వల్ల అలెర్జీ ఉంటే.. తప్పకుండా హెయిర్ స్పాకు దూరంగా ఉండటం మంచిది. రసాయనాలు కలిగిన ఉత్పత్తులు తలపై ఉండే చర్మం లేదా జుట్టుకు మరింత నష్టం కలిగిస్తాయి.
జుట్టు రంగు మసకబారుతుంది:
హెయిర్ స్పా పదే పదే చేయడం వల్ల జుట్టు రంగు మసకబారుతుంది. ఎందుకంటే హెయిర్ స్పాలో బ్లీచ్ వంటి అనేక హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. దీని కారణంగా.. జుట్టు రంగు పాలిపోయే ప్రమాదం ఉంది. ఎక్కువ సార్లు హెయిర్ స్పా చేయించుకుంటే సహజ రంగు పూర్తిగా తొలగిపోతుంది. అంతే కాకుండా నల్ల జుట్టు కూడా కెమికల్స్ కారణంగా తెల్లగా మారే ప్రమాదం కూడా చాలా వరకు ఉంటుంది.
జుట్టు పొడిగా మారుతుంది:
మీరు తరచుగా లేదా హెయిర్ స్పా చేయించుకుంటే మాత్రం అది జుట్టు యొక్క సహజ తేమ తగ్గడానికి దారితీస్తుందని గుర్తించండి. దీని కారణంగా.. జుట్టుతో పాటు, తల చర్మం కూడా పొడిగా మారడం ప్రారంభమవుతుంది. చుండ్రు పేరుకుపోవడం వల్ల జుట్టు రాలడం కూడా పెరుగుతుంది.
ఖర్చు పెరుగుతుంది:
హెయిర్ స్పాను పదే పదే చేయించుకోవడం వల్ల కలిగే అతిపెద్ద ప్రతికూలత ఇది. దీని వల్ల.. మీ జేబు చాలా ఖాళీ అవుతుంది. ఎందుకంటే చిన్న సెలూన్లో హెయిర్ స్పా చేయించుకోవడానికి కూడా మీరు 500 నుండి 1000 రూపాయల వరకు సులభంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే అవసరమైనప్పుడు మాత్రమే హెయిర్ స్పా చేయించుకోండి.