HIT 3 OTT: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త సినిమా హిట్ 3. తొలిసారిగా నాని ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు శైలేశ్ కొలను ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్న ఈ సినిమాలో నాని ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు.
ఈ చిత్రం మే 1న గ్రాండ్ లెవెల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ ధరకు అమ్మినట్లు సమాచారం. ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలిసింది. దీని కోసం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్ ఏకంగా రూ.54 కోట్లు చెల్లించినట్లు తెలిసింది. దీంతో నాని కెరీర్లో ఓ సినిమా ఓటీటీ హక్కుల కోసం వెచ్చించిన అత్యధిక మొత్తం ఇదే కావడం గమనార్హం. హిట్ ఫ్రాంఛైజీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. అందులోనూ ఇప్పుడు మూడో పార్ట్‌లో నాని నటిస్తుండటంతో ‘హిట్3’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాల వల్లనే డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి.
కాగా హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్సేన్, సెకండ్ పార్ట్‌లో అడవి శేష్ హీరోలుగా నటించి అదరగొట్టేశారు. ఇక ఇప్పుడు మూడో పార్ట్ లో నాని నటిస్తుండటంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.