arjun son of vyjayanthi: కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఏప్రిల్ 18,2025న విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

కాగా ఈ సినిమా ఒక తల్లి-కొడుకు మధ్య జరిగే ఎమోషనల్ సన్నివేశాలతో పాటు హై-ఆక్టేన్ యాక్షన్ సీన్లతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమాలో వైజయంతి ఐపీఎస్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తోంది. దీంతో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని గ్లింప్స్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.ఇందులో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్‌గా సాయి మంజ్రేకర్ నటిస్తుంది. అదే సమయంలో బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ ఇందులో కళ్యాణ్ రామ్‌ను ఢీ కొట్టే పాత్రలో కనిపించనున్నాడు.

శ్రీకాంత్, పృథ్వీరాజ్ వంటి కీలక నటులు ఇందులో భాగం అయ్యారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించాయి.

తరవాత కథనం