Pithapuram: నాగబాబు పర్యటనలో ఉద్రిక్తత.. పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన!

పిఠాపురం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నాగబాబు పర్యటనతో టిడిపి, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇరు పార్టీ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఒక్కసారిగా పిఠాపురంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్కడ ఆదిపత్య పోరు పీక్స్ కు చేరింది. టిడిపి vs జనసేన మధ్య ఫైట్ బాగా ముదిరింది.

అందుకు కారణం ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన అని తెలుస్తోంది. ఇవాళ పిఠాపురంలోని కుమారపురం గ్రామంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించారు. ఆ గ్రామంలోని సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి వర్సెస్ జనసేన నాయకులు పోటపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య విపరీతమైన తోపులాట జరిగింది.

అంతకంతకు పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే ఇరు పార్టీల వారిని పోలీసులు చెదరగొట్టారు. అయితే ఇవాళ మాత్రమే కాకుండా నిన్న కూడా ఇలాంటి వాతావరణమే నెలకుంది. ఏప్రిల్ 4 న ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురంలో పర్యటించారు. అక్కడ గొల్లప్రోలు దగ్గర సి ఎస్ ఆర్ ఫండ్స్ తో హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఆరోజు కూడా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అంతేకాకుండా హెల్త్ సెంటర్ శంకుస్థాపన శిలాఫలకంపై చంద్రబాబు పేరు లేదని పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ విషయంపై టిడిపి, జనసేన కేడర్ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. అయితే నాగబాబు పర్యటనకు టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ దూరంగా ఉండటం మరింత ఆశ్చర్యకరంగా మారింది.

దీని కారణంగానే పిఠాపురంలో నాగబాబు వెళ్లిన ప్రతిచోట టిడిపి కార్యకర్తల నినాదాలు వినిపిస్తున్నాయి అని గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ విషయంపై నాగబాబు తీవ్ర స్థాయిలో మండిపడినట్లు తెలుస్తోంది. కాగా ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. చూడాలి మరి ఈ వ్యవహారం ఇంకా ఎంతవరకు దారితీస్తుందో

తరవాత కథనం