cucumber side effects: కీరదోస అధికంగా తింటే కలిగే భయంకరమైన 4 నష్టాలు.. తెలిస్తే షాకే!

వేసవి వచ్చేసింది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. దీంతో చాలామంది బాడీ హీట్ ఎక్కిపోతుందని చలువ చేసే ఆహార పదార్థాలను తింటుంటారు. అందులో శరీరానికి చలువు చేసే ఆహారాలలో కీరదోస ఒకటి. వేసవికాలంలో ఎక్కువ మంది కీరదోస తినడం, లేదా జ్యూస్ తాగడం వంటివి చేస్తారు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా కీరదోస తింటే ప్రయోజనాలు పొందచ్చని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.

కీరదోశలో నీటి శాతం, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం, మెగ్నీషియంతో పాటు మరెన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంతోపాటు.. బాడీని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. వీటితో ఎన్నో లాభాలు ఉన్నాయి. కీర దోస శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ముఖ్యంగా ఇది వేసవిలో బాగా ఉపయోగపడుతుంది. అయితే దీనివల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా ఎక్కువగా తింటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి చలువ చేస్తుందని లేదా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని అతిగా తింటే మాత్రం సమస్యలు తప్పవని చెబుతున్నారు. దీనివల్ల కలిగే సమస్యలు తెలుసుకుందాం.

జీర్ణ సంబంధిత సమస్యలు

కీరదోశలో కుకుర్బిటాసిన్ అనే పదార్థం ఉంటుంది. అందువల్ల దీనిని ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, మలం పలుచగా ఉండటం, జీర్ణక్రియ సమస్యలు వంటివి తలెత్తుతాయి. అందువల్లే తక్కువగా కీరదోస తినాలి.

తక్కువ రక్తపోటు

కీరదోసలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. కానీ దీనిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. దీని కారణంగా హైపర్ కలేమియా వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల కూడా మూత్రపిండాల సమస్యలు, గ్యాస్, వాపు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.

అలెర్జీ

కీరదోస అధికంగా తినడం వల్ల కొంతమందికి అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో నోటిలో మంట, దురద, చర్మంపై దద్దుర్లు వంటివి లక్షణాలు కనిపిస్తాయి.

మూత్ర సంబంధిత సమస్యలు

కీరదోసలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల దీనిని ఎక్కువగా తీసుకుంటే మూత్ర విసర్జన విపరీతమవుతుంది. దీనివల్ల డిహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా కీరదోసలో మూత్ర విసర్జనం పెంచే లక్షణం ఉంటుంది. అందువల్ల దీనిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.

తరవాత కథనం