Harry Brook: ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్

ఇంగ్లాండ్ కు కొత్త కెప్టెన్ వచ్చేసాడు. పరిమిత ఓవర్ల క్రికెట్కు ఇంగ్లాండ్ యాజమాన్యం కొత్త కెప్టెన్ ను నియమించింది. యంగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ను కొత్త కెప్టెన్ గా అనౌన్స్ చేసింది. అతడు వన్డేలు, టి20 లో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన రిలీజ్ చేసింది.

కాగా 2022లో అరంగేట్రం చేసిన ఈ 26 ఏళ్ల బ్రూక్ ఇప్పటికే వైస్ కెప్టెన్గా వన్డేలు, టి20 లో వ్యవహరించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతడికి కెప్టెన్ బాధ్యతలను అప్పగించింది. కాగా ఈ ఏడాది జనవరిలో టీమిండియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు పేవలమైన ప్రదర్శన చేసింది.

దీని అనంతరం ఆ జట్టుకు కెప్టెన్ గా ఉన్న జోష్ బట్లర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు హ్యారీ బ్రూక్ ను పరిమితి ఓవర్ల కెప్టెన్గా నియమించింది. దీనిపై బ్రూక్ స్పందించాడు. ఇంగ్లాండ్ కు నాయకత్వం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని అన్నాడు. కాగా బ్రూక్ ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్కు దూరంగా ఉన్నాడు.

అతడు గత సీజన్ లోను ఐపీఎల్ ఆడలేదు. దీంతో వరుసుగా రెండేళ్లు ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో అతడిపై రెండేళ్ల పాటు నిషేధం విధించారు. ఐపీఎల్ నిబంధన ప్రకారం.. వేలంలో అమ్ముడైన ఆటగాడు ఫిట్గా ఉండి కూడా వరసుగా రెండు సిజన్లు దూరమైతే రెండేళ్లు నిషేధం పడుతుంది.

బ్రూక్ గతేడాది తన బామ్మ మరణాన్ని కారణంగా చూపి ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది కూడా  వేలంలో అమ్ముడైన తర్వాత ఇంగ్లాండ్ తరఫున భవిష్యత్ సిరీస్లను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. దీంతో అతడి పై రెండేళ్ల నిషేధం పడింది. అతడు 2027లో ఐపిఎల్ ఆడే అవకాశం ఉంది.

తరవాత కథనం