కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే విడాముయార్చి సినిమాతో వచ్చాడు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది.
అభిమానులకు కావలసిన యాక్షన్ సన్నివేశాలు ఇందులో లేకపోవడంతో నిరాశ చెందారు. ఈసారి అలాంటి తప్పు చేయకుండా ఉండేందుకు అజిత్ భారీ యాక్షన్ ఫిల్మ్తో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. అతడు నటిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం “గుడ్ బాడ్ అగ్లీ”. యంగ్ డైరెక్టర్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాతో మైత్రి మూవీ మేకర్ సంస్థ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో సర్ప్రైజ్ ను మేకర్స్ అందించారు.
ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో అజిత్ యాక్షన్ ఊర మాస్ గా ఉంది. ట్రైలర్ చూస్తే అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమాగా ఇది వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్లో అజిత్ మాస్ పర్ఫామెన్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
ఇందులో అజిత్ సరసన సీనియర్ నటి త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. జీవి ప్రకాష్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇందులో కోలీవుడ్ సీనియర్ యాక్టర్ ప్రభు, అర్జున్ దాస్, సునీల్ వంటి నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఏప్రిల్ 10 న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది.