court movie OTT: ఓటీటీలోకి ‘కోర్టు’ మూవీ.. కొన్ని గంటల్లో స్ట్రీమింగ్

ఇటీవల వచ్చిన మోస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉంది అంటే అది “కోర్ట్” మూవీ అని చెప్పాలి. ఒక చిన్న సినిమాగా వచ్చిన కోర్టు మూవీ కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. ఎంతోమంది చేత ప్రశంసలు అందుకుంది. పోక్సో కేసు లాంటి సెన్సిటివ్ అంశంపై తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది.

రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి, హర్ష రోహన్, శ్రీదేవి ప్రధాని పాత్రలో నటించారు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం నిర్మాతలకు లాభాలు పంట పండించింది. ఏకంగా రూ.57 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటి అబ్బురపరిచింది. లీగల్ డ్రామాగా వచ్చిన కోర్టు మూవీను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నేచురల్ స్టార్ నాని సమర్పించారు.

ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో ప్రియదర్శి లాయర్ పాత్రలో నటించాడు. హర్ష రోహన్, శ్రీదేవి ప్రేమికుల పాత్రలో నటించి మెప్పించారు. శివాజీ యాక్టింగ్ అదరగొట్టేసాడు. ఈ సినిమా థియేటర్ రిలీజ్ అనంతరం ఇప్పుడు ఓటీటి లోకి వచ్చేందుకు సిద్ధమయింది.

ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో అందుబాటులోకి రానుంది. చూడాలి మరి థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఓటీటిలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.

తరవాత కథనం