ఐపీఎల్ 18వ సీజన్లో నిన్న 23వ మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉత్కంఠ భరితమైన పోరు కొనసాగింది. ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్ ను ఓటమితో మొదలెట్టిన గుజరాత్ జట్టు అదిరే ఆటతో దూసుకుపోతుంది.
ఆ జుట్టుకు ఎదురు లేకుండా పోయింది. అన్ని రంగాల్లో తిరుగులేని అధిపత్యాన్ని ప్రదర్శిస్తూ విజయాలు సాధిస్తుంది. నిన్నటి మ్యాచ్లో గుజరాత్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుతమైన పర్ఫామెన్స్ అందించాడు. గుజరాత్ జట్టు విజయం సాధించడంలో వెన్నుముకగా నిలిచాడు. దీంతో 58 పరుగులు తేడాతో గుజరాత్ జట్టు రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ దిగిన గుజరాత్ జట్టు అద్భుతమైన ఆట తీరు కనబరిచింది. అయితే ఆదిలోనే ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మూడు బంతులు ఆడిన శుభమనగిల్ రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ చెలరేగిపోయాడు. తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. అతడు ఇన్నింగ్స్ కు వెన్నుముకల నిలబడడంతో గుజరాత్ భారీ స్కోరు చేసింది.
53 బంతుల్లో 82 పరుగులు సాధించి దుమ్ము దులిపేశాడు. అలాగే జోష్ బట్లర్ 25 బంతుల్లో 36 పరుగులు చేసి ఔరా అనిపించాడు. షారుక్ ఖాన్ 20 బంతుల్లో 36 పరుగులు సాధించాడు. ఇలా పలువురు భారీ స్కోర్ రాబట్టడంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
ఈ భారీ లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టు తడబడింది. మూడు ఓవర్ల కాకముందే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన సంజు సాంసన్, రియాన్ పరాజ్ చేతులెత్తేశారు. 19.2 ఓవర్లలో 159 పరుగులకే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆల్ అవుట్ అయింది. ఈ జట్టులో హెట్మేయర్ 32 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. అలాగే సంజు సాంసంన్ 28 బంతుల్లో 41 పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమి బాట పట్టింది.