ఐపీఎల్ 18వ సీజన్లో 24వ మ్యాచ్ నిన్న జరిగింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రసవత్రమైన పోరు కొనసాగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు సొంత గడ్డపై ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు బ్యాటర్ కె.ఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. ఢిల్లీ జట్టు విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. 53 బంతుల్లో 93 పరుగులు చేసి ఓడిపోతున్న మ్యాచును గెలిపించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు మొదటి నుంచి దూకుడుగా ఆడింది. ఆ దూకుడు చూసి ఆర్సిబి జట్టు 200కు పైగా స్కోర్ చేస్తుందని అంత భావించారు. ఓపెనర్లుగా దిగిన కోహ్లీ, సాల్ట్ పరుగుల వరద రాబట్టారు. మూడు ఓవర్లోనే 50 పరుగులకు పైగా రన్స్ సాధించారు. మూడవ ఓవర్ లో సాల్ట్ వరుసగా 6 4 4 4 6 బాదేసాడు.
ఈ ఊపు చూసి ఆర్ సి బి జట్టు స్టేడియంలో పరుగులు వరద రాబడుతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. కానీ వారు ఎక్కువ సమయం క్రిజ్ లో నిలబడలేకపోయారు. వెంటనే సాల్ట్ రన్ అవుట్ అయ్యాడు. అతడు 17 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. అందులో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి. అక్కడినుంచి బెంగళూరు పతనం మొదలైంది.
ఫీల్ సాల్ట్ తర్వాత పడికల్ ఒకరన్నకే వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓవర్ లో విరాట్ కోహ్లీ వికెట్ ఇచ్చేసాడు. కేవలం 14 బంతుల్లో 22 పరుగులు చేసి పేవీలియన్కు చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ పాటిదార్ మెల్లమెల్లగా పరుగులు రాబట్టాడు. కానీ అతడు కూడా ఎక్కువ సమయం ఆటలేకపోయాడు. 25 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత ఉన్న బ్యాటర్లు కూడా చేతులెత్తేశారు. లివింగ్ స్టన్ నాలుగు పరుగులు, జితేష్ శర్మ మూడు పరుగులతో తడబడి వెనుతిరిగారు. ఇలా 18 ఓవర్లకు బెంగళూరు ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన డేవిడ్ చెలరేగిపోయాడు. అతడి కారణంగా బెంగళూరు జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
దీంతో లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదటి నుంచి తడబడింది. వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుసగా డూప్లెసిస్ (2), జెక్ ఫ్రీజర్ (7), అభిషేక్ పోరెల్ (7) పేవలమైన బ్యాటింగ్ తో పెవీలియన్కు చేరారు. దీంతో ఢిల్లీ జట్టు ఘోర ఓటమిని చూస్తుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత అక్షర పటేల్ సైతం చేతులెత్తేశాడు. కేవలం 15 పరుగులు చేశాడు.
ఆ సమయంలో ఢిల్లీ జట్టు 4 వికెట్ల నష్టానికి 58 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సొంత గడ్డపై బెంగళూరు జట్టు విజయం ఖాయమైందని ఆర్ సి బి ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. అప్పుడే ఒకడు వచ్చాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. వచ్చిన ఒక్క ఛాన్స్ ను బాగా వినియోగించుకున్నాడు. అతడే కేఎల్ రాహుల్.
అతడు ఐదు పరుగులు వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ పాటిదా కేఎల్ రాహుల్ క్యాచ్ను వదిలేసాడు. అదే ఆ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ ఒక్క ఛాన్స్ ను కేఎల్ రాహుల్ ఎంతగానో వినియోగించుకున్నాడు. అక్కడి నుంచి చెలరేగిపోయాడు. వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మ్యాచ్ రూపాన్ని మార్చేశాడు. ఆర్ సి బి వైపు ఉన్న విన్నింగ్ ను తమ వైపుకు లాగేసాడు. ఇలా 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 93 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అందులో 7 ఫోర్లు, ఆరు సిక్స్ లు ఉన్నాయి.