Jack Day 1 Collections: ‘జాక్’ మూవీకి ఫస్ట్ డే ఊహించని కలెక్షన్స్.. ఎంతంటే?

టిల్లు స్క్వేర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ.. బేబీ మూవీ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన వైష్ణవి చైతన్య తమ కెరీర్లో అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఇప్పుడు ఈ జంట అదిరిపోయే హిట్ కొట్టాలని జత కట్టింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే మూవీ చేశారు. ఇందులో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేస్తూ వచ్చింది. టీజర్లు, గ్లిమ్స్, పోస్టర్స్, సాంగ్స్, ఆఖరికి ట్రైలర్ ద్వారా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సినీ ఆడియన్స్ ను అలరించలేక డీలా పడింది. స్పై యాక్షన్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వారి అంచనాలను అందుకోలేకపోయింది.

దీంతో బాక్సాఫీస్ వద్ద దారుణమైన నెగిటివ్ టాక్ ను అందుకుంది. ఇందులో సిద్దు జొన్నలగడ్డ ఒక రా ఏజెంట్గా నటించాడు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కొత్తగా ప్రయత్నించాడు. సీరియస్ టాపిక్ ను ఫన్నీ వేలో చూపించి ఆడియన్స్ను బాగా ఎంటర్టైన్ చేయాలని అనుకున్నాడు. కానీ అతడి ప్రయత్నం విఫలమైంది. ఇందులో సిద్దు కామెడీ కూడా ఎవర్ని ఆకట్టుకోలేకపోయింది.

అలాగే మ్యూజిక్ కూడా పెద్దగా అట్రాక్ట్ చేయలేదు. దీంతో ఈ సినిమా ఫస్ట్ రోజే బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. ప్రీమియర్స్ నుంచే నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ఊహించిన దెబ్బ పడింది. మొదటిరోజు ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. వరల్డ్ వైడుగా ఫస్ట్ డే రెండున్నర కోట్ల లోపే వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అందులో తెలుగు రాష్ట్రాల నుంచి కోటిన్నర వరకు వసూలు చేసినట్లు తెలిసింది. అలాగే ఓవర్సీస్ లో మరో కోటి వరకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక రెండో రోజు కూడా జాక్ చిత్రం బాగా పడిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

తరవాత కథనం