lips Causes: లిప్స్ పగిలిపోవడం.. నల్లగా మారడానికి కారణాలు ఇవే.. ఈ టిప్స్‌తో కంట్రోల్ చేసేయండి!

సాధారణంగా శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలంలో ఆరోగ్యంలో ఎన్నో మార్పులు వస్తాయి. అందులో పెదవులు పగిలిపోవడం ఒకటి. ఈ సీజన్లో కూడా చాలామందిలో పెదవులు పగులుతాయి. కొందరికి రక్తం కూడా వస్తుంది. అలాంటి సమయంలో చాలామంది కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అలా చేయడం చాలా తప్పని వైద్యులు అంటున్నారు. శరీరంలో కొన్ని పోషకాల లోపంతో పెదాలు పగులుతాయని చెబుతున్నారు. వాటిని భర్తీ చేయడం ద్వారా పెదాలను మళ్లీ మామూలు స్థితికి తీసుకురావచ్చు అంటున్నారు.

చాలామందికి పెదవుల అంచుల్లో పగుళ్లు ఏర్పడతాయి. నోరు తెరిచేటప్పుడు చాలా నొప్పిని కలిగిస్తాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం విటమిన్ బి 2. ఈ లోపం కారణంగానే పెదాల అంచుల్లో పగుళ్లు వస్తాయి. అందువల్ల పాలు, గుడ్లు, మాసం, పండ్లు వంటివి తినడం వల్ల ఆ లోపాన్ని భర్తీ చేయవచ్చు.

మరికొందరిలో పెదాల కలర్ మారుతుంటాయి. కాస్త నల్లగా అవుతుంటాయి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మెలనిన్ ఒకటి. శరీరంలో మేలనిన్ పెరిగితే పెదవుల కలర్ నల్లగా మారుతుంది. ఆవకాయ తినడం ద్వారా ఈ లోపాన్ని భర్తి చేయవచ్చు. అలాగే రక్తహీనత, బాడీలో ఐరన్ లోపం వల్ల పెదాలు కలర్ మారుతుంటాయి. ఇందుకోసం అధికంగా ఐరన్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. చేపలు, మాంసం, ఆకుకూరలు, బీన్స్, నట్స్, తృణధాన్యాలు వంటివి తినాలి.

కొన్ని సీజన్లలో పెదవులు పొడిబారుతాయి. దీనికి ఆహారం, ఆరోగ్య పరిస్థితులు, పర్యావరణ కారకాలు వంటివి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటితోపాటు పొడిగాలి, సూర్యరశ్మి, చల్లని వాతావరణం, వంటివి కూడా పెదవుల పొడి బారడానికి దోహదం పడతాయి. విటమిన్ లోపాలు కూడా దీనికి కారణం అవుతాయి. అందువల్ల వాటిని నివారించాలంటే.. ఎక్కువగా నీరు తాగాలి. సూర్య రశ్మి నుంచి జాగ్రత్త పడాలి.

తరవాత కథనం