నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో సీనియర్ నటి విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇటీవల సాంగ్ రిలీజ్ చేయగా సినీ ప్రేక్షకులను.. అభిమానులను అలరించింది. తాజాగా మూవీ నుంచి ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ ట్రైలర్ను తల్లి కొడుకుల అను బంధాన్ని హైలెట్ చేస్తూ చూపించారు. పవర్ఫుల్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి కొడుకు అయిన అర్జున్ ఎందుకు క్రిమినల్ అయ్యాడు.. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్గా అతడు ఎలా మారాడు.. అనే సస్పెన్షన్ను క్రియేట్ చేస్తూ ట్రైలర్ను రిలీజ్ చేశారు.
దానికి తోడు యాక్షన్ సన్నివేశాలు యాడ్ చేస్తూ చూపించిన ట్రైలర్ అదిరిపోయింది. అలాగే పవర్ ఫుల్ డైలాగ్ లు కూడా సినిమాకి హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ప్రదీప్ ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్ తో పాటు తల్లి కొడుకుల బంధాన్ని కూడా హైలెట్ చేశాడు. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా బిజిఎం హైలెట్ అనిపించింది. ఇందులో కళ్యాణ్ రామ్ మోస్ట్ ఊర మాస్ లుక్ లో కనిపించాడు. అన్ని పనులు పూర్తిచేసుకుని ఈ చిత్రం ఏప్రిల్ 18న గ్రాండ్ లెవెల్ లో థియేటర్లలో రిలీజ్ కారుంది.