hit 3 run time: అర్జున్ సర్కార్ రన్ టైం వచ్చేసింది.. ఇక రచ్చ రచ్చే

నాచురల్ స్టార్ నాని ఇప్పుడు బిగ్ సినిమాతో రాబోతున్నాడు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన హిట్, హిట్ 2 చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. మొదటి పార్ట్ లో విశ్వక్సేన్ నటించి అదరగొట్టేసాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత హిట్ 2 తెరకెక్కించారు.

ఇందులో అడవి శేష్ హీరోగా నటించిన మరింత ఆకట్టుకున్నాడు. ఈ సినిమా భారీ విజయం తర్వాత ఇప్పుడు హిట్ 3తో వచ్చేస్తున్నారు. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇవాళ అంటే ఏప్రిల్ 14న మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

చూడాలి మరి ట్రైలర్ సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ రన్ టైం వచ్చేసింది. చిత్ర బృందం ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఇందులో కాస్త వైలెన్స్, డబల్ మీనింగ్ డైలాగ్స్, హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో వాటిని తొలగించినట్లు తెలిసింది.

ఈ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ మూవీ 2 గంటల 35 నిమిషాల రన్ టైం తో కొనసాగనుంది. అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ చిత్రం మే1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలు మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

తరవాత కథనం