Allu Arjun Meet with Pawan Kalyan: ఇటీవల సూపర్ స్టార్ అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి ఆకస్మికంగా వెళ్లారు. దీంతో సోషల్ మీడియా, తెలుగు చిత్ర పరిశ్రమ ఊహాగానాలతో నిండిపోయింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశం పరిశ్రమ అంతటా సంచలనం సృష్టించింది.ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ సోమవారం (ఏప్రిల్ 14, 2025) హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు.ఈ భేటీ తెలుగు సినిమా అభిమానులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఒకే కుటుంబానికి చెందినవారు. అయినా గత ఏడాది రెండేళ్లుగా జరగుతున్న పరిణామాలతో వీరి కలయిక హెడ్‌లైన్స్ ఎక్కింది.
కుటుంబానికి పరామర్శ
ఇటీవల పవన్ కల్యాణ్ కుమారుడు సింగపూర్‌లో ఓ వర్క్‌షాపులో పాల్గొని అక్కడ జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. మార్క్ శంకర్ గాయాలతో సింగపూర్‌లోని ఆసుపత్రిలో చేరాడు. దీంతో అంతా కంగారుపడ్డారు. మొత్తానికి బాలుడు కోలుకొని మూడురోజుల క్రితం స్వదేశానికి వచ్చాడు. ఆ బాలుడిని పరామర్శించి కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు అల్లు అర్జున్ వెళ్లాడు. చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ కలుసుకోవడం చర్చనీయాంశమైంది.
మార్క్ ఆరోగ్యంపై ఆరా
పవన్ కల్యాణ్‌తో మాట్లాడిన అల్లు అర్జున్ మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఘటన ఎలా జరిగింది, ఏం జరిగిందనే విషయాల గురించి తెలుసుకున్నారు. బాలుడు కోలుకుంటున్నందున సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన కుటుంబాన్ని కూడా అల్లు అర్జున్ కలిశారు. ధైర్యంగా ఉండాలని దేవుడు అండగా ఉన్నాడని వాళ్లను ఓదార్చారు.
చాలా కాలంగా విభేదాలు
చాలా కాలంగా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఎన్నికల టైంలో ఆయన ఇంటికి వెళ్లి ప్రచారంపై ప్రభావం చూపారు. దీంతో ఆయనపై మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాత పలు సందర్భాల్లో అల్లు అర్జున్, అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీని కించపరుస్తూ కామెంట్స్ చేశారు. దీంతో ఆగ్రహం మరింత ఎక్కువ అయ్యింది.
పుష్ప 2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం, బాలుడు గాయాలుపాలవ్వడంతో వివాదానికి దారి తీసింది. దుర్ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసి అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. అ టైంలో అల్లు అర్జున్ టీం ఈ దుర్ఘటనను సరిగా డీల్ చేయలేదని పవన్ నేరుగానే కామెంట్స్ చేశారు. అంతకు ముందు స్మగ్లర్లను హీరోలుగా చూపించడం ఏంటని ప్రశ్నించారు. ఇలా పలు సందర్భంగా పవన్ కల్యాణ్, మెగా హీరోలు కూడా అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు.
ఇవన్నీ పక్కన పెడితే మొన్న అల్లు అర్జున్ బర్త్‌డేకు మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా విష్ చేయలేదు. ఆ తర్వాత జరిగిన రామ్‌చరణ్ బర్త్‌డేపై కూడా అల్లు అర్జున్ స్పందించలేదు. దీంతో ఈ విభేదాలు మరింత ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమైంది. ఇప్పుడు మార్క్ శంకర్‌కు గాయాలు అవ్వడం, పవన్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం చర్చనీయాంశమైంది.