Nani HIT 3: ఇదేక్కడి అరాచకం.. రిలీజ్‌కు ముందే RRR రికార్డును బ్రేక్ చేసిన HIT 3 మూవీ

నేచురల్ స్టార్ నాని ‘హిట్ 3’ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో అర్జున్ సర్కార్ గా నాని పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఉంది. ఎక్కడ చూసినా నరుకుడే నరుకుడు. ఫుల్ యాక్షన్ సీన్లతో ట్రైలర్ దుమ్ము దులిపేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీలో నాని వైల్డ్ ఫైర్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఆ ట్రైలర్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. రిలీజ్ చేసిన కొద్ది గంటలకే హిట్ 3 మూవీ ట్రైలర్ దూసుకుపోయింది. తాజాగా ఈ ట్రైలర్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైలర్ రికార్డును బ్రేక్ చేసింది. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ కు 24 గంటల్లో 20.45 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ తాజాగా నాని హిట్ 3 మూవీ ట్రైలర్ మాత్రం 24 గంటల్లో 21.30 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోయింది.

దీంతో RRR రికార్డును నాని హిట్ 3 బద్దలు కొట్టిందని చెప్పాలి. నాని ఇప్పుడు వరకు తన కెరీర్లో నటించిన ఏ సినిమాకు ఇన్ని మిలియన్ వ్యూస్ రాలేదు. ఇక అత్యధిక వ్యూస్ తో పుష్ప 2 నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఈ మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో 44.67 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఇదిలా ఉంటే యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో  వస్తున్న హిట్ 3 మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన హిట్, హిట్ 2 చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. మొదటి పార్ట్ లో విశ్వక్సేన్ నటించి అదరగొట్టేసాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత హిట్ 2 తెరకెక్కించారు.

ఇందులో అడవి శేష్ హీరోగా నటించిన మరింత ఆకట్టుకున్నాడు. ఈ సినిమా భారీ విజయం తర్వాత ఇప్పుడు హిట్ 3తో వచ్చేస్తున్నారు. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఈ మూవీ రన్ టైం వచ్చేసింది.

చిత్ర బృందం ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఇందులో కాస్త వైలెన్స్, డబల్ మీనింగ్ డైలాగ్స్, హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో వాటిని తొలగించినట్లు తెలిసింది. ఈ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ మూవీ 2 గంటల 35 నిమిషాల రన్ టైం తో కొనసాగనుంది. అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ చిత్రం మే1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలు మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

తరవాత కథనం