టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ సీజన్ ఐపిఎల్ లో ఎలాంటి ఫామ్ కనబరచడం లేదు. ఏ ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేకపోతున్నాడు. క్రీజులోకి వచ్చి ఎక్కువ సమయం నిలబడలేకపోతున్నాడు. ఒక్క మ్యాచ్ లో కూడా 20 పరుగులు చేయలేకపోయాడు. దీంతో రోహిత్ శర్మ బ్యాటింగ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు, క్రికెట్ ప్రియులు నిరాశ చెందుతున్నారు.
ప్రతి మ్యాచ్ లోను రోహిత్ విఫలమవుతూనే ఉన్నాడు. అతడు ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో 0, 8, 13, 17, 18 పరుగులు రాబట్టాడు. ఇక రోహిత్ శర్మ ఫామ్ లో లేకపోవడం వల్ల ముంబై ఇండియన్స్ జట్టు పై తీవ్ర ప్రభావం పడుతుందని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన మ్యాచ్ లలో రెండింట్లో మాత్రమే విజయం సాధించింది.
మరో నాలుగింట్లొ పరాజయం పాలైంది. రీసెంట్గా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ను సొంతం చేసుకుంది. కేవలం 12 పరుగులు తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు గెలుపొందింది. ఆ మ్యాచ్లోనూ రోహిత్ పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయాడు. ఇక రోహిత్ శర్మ పేవలమైన ఫామ్ పై ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా రియాక్ట్ అయ్యారు.
రోహిత్ శర్మ ఫామ్ లో లేకపోతే వేరొక స్థానంలో రావాలి అని అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఫామ్ లో లేకపోవడం నేరం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. కానీ ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ లో ఉండాలంటే ఎన్నో శుభారంబాలు జరగాలని అన్నారు. రోహిత్ శర్మ ఎలాగూ ఫామ్ లో లేడు కాబట్టి అతడు ఓపెనర్ గా రాకూడదని.. కాస్త వెనక్కి తగ్గాలని తన అభిప్రాయాన్ని తెలిపాడు.
మనం ఏ మ్యాచ్ చూసిన అభిమాన బ్యాటర్ ఫామ్ లో ఉండాలని కోరుకుంటారని.. అలా కొందరు త్వరగానే ఫామ్ లోకి వచ్చేస్తారని అన్నారు. కానీ ఈ సీజన్లో మాత్రం రోహిత్ శర్మ ఇంకా పేవలమైన ఫామ్ కొనసాగిస్తున్నాడని.. అతడికి మంచి ఆరంభం దక్కలేదని పేర్కొన్నాడు. ఏది ఏమైనా రోహిత్ శర్మ ఎంతటి గొప్ప ఆటగాడో.. ఎలాంటి మ్యాచ్ విన్నారో అందరికీ తెలుసని అతడు చెప్పుకొచ్చాడు.