OG first song: ఇది కదా కిక్కంటే.. ‘ఓజీ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు రెడీ.. తమన్ ట్రీట్ అదిరింది!

ఇది కదా అప్డేట్ అంటే.. ఇది కదా సర్ప్రైజ్ అంటే.. ఇది కదా ట్రీట్ అంటే.. ఏంటి అని అనుకుంటున్నారా..?. మీరే కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదా మెగా ఫ్యాన్స్ అయ్యుంటే ఈ అప్డేట్ విని మీరు ఎగిరి గంతేస్తారు. అవును మీరు విన్నది నిజమే. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం నుంచి తలపిచ్చెక్కించే అప్డేట్ వచ్చేసింది. ఆ అప్డేట్ వింటుంటే ఉత్సాహం పొంగిపొర్లుతుంది. అదేంటి అని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో “OG” సినిమా వస్తుంది. “అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు అంటే” అనే డైలాగ్ సినిమా రేంజ్ను మార్చేసింది. భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అంగ్రీచీత సాంగ్ ఓ ఊపు ఊపేసింది. అందులోనూ ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ యాక్షన్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.

ఇందులో అతడు చాలా పవర్ ఫుల్ గా కనిపించడంతో పిచ్చెక్కిపోయారు. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ అప్డేట్ వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. తాజాగా పవన్ ఫ్యాన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే అప్డేట్ అందించాడు. ఈ మూవీ సాంగ్స్, అలాగే ఫస్ట్ సాంగ్ రిలీజ్ గురించి గుడ్ న్యూస్ చెప్పాడు.

ఓ ఈవెంట్ లో పాల్గొన్న తమన్ తాజాగా ఈ విషయం చెప్పుకొచ్చాడు. ఓజి చిత్రంలో మొత్తం ఏడు పాటలు ఉంటాయని తెలిపాడు. ఇప్పటికే అవన్నీ కంప్లీట్ చేశామని అన్నాడు. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆ సాంగ్స్ ను స్పెషల్ గా చేసామని తెలిపారు. ఆ సాంగ్స్ మాత్రం ఫ్యాన్స్ కు అదిరిపోయే కిక్కిస్తాయని హైపెక్కించాడు. త్వరలో ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్ త్వరలోనే సెట్స్ పైకి వస్తారని.. అప్పుడు ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇకనుంచి ప్రతి విషయంపై అప్డేట్ ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ అప్డేట్ తో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చూడాలి మరి ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో.

తరవాత కథనం