ఐపీఎల్ 18వ సీజన్లో నిన్నటి మ్యాచ్ లో ఒక అద్భుతమే జరిగింది. పంజాబ్ కింగ్స్ vs కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. హిట్టర్లకు కొదవలేని కోల్కతాకు ఈ మ్యాచ్ లో ఊహించని బిగ్ షాక్ తగిలింది. కేవలం 112 టార్గెట్ ను చేదించలేక సత్తకిల్ల పడింది. 15 ఓవర్లకే టార్గెట్ చేదించలేక ఆల్ అవుట్ గా నిలిచింది. ఈ మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ 16 పరుగులు తేడాతో కోల్కతాను ఓడించింది. దీంతో పంజాబ్ జట్టు అతి పెద్ద రికార్డును సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే 20 ఓవర్ల మ్యాచ్లో అతి తక్కువ స్కోరును రక్షించుకున్న జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు పూర్తిగా తేలిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈ జట్టుకు గట్టి షాక్ తగిలింది. కేకేఆర్ బౌలర్ల దాటికి విలవిల్లాడిపోయింది. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ తమ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ జట్టు బాటర్లకు చుక్కలు చూపించింది. అయితే మొదట నుంచి కింగ్స్ జట్టు ఓపెనర్లు ప్రభమాన్ సింగ్, ప్రియాంస ఆర్యన్ దూకుడుగా ఆడారు.
వరుసగా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఇలా 3 ఓవర్లలోనే పంజాబ్ జట్టు 39 పరుగులు చేసింది. భారీ స్కోరు చేస్తుంది అనే లోపు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రియాంస్ ఆర్య అవుట్ అయ్యాడు. అక్కడ నుంచి కింగ్స్ పతనం మొదలైంది. వరుసగా వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లుగానే పెవిలియన్ బాట పట్టారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా ఎక్కువ సమయం క్రీజ్ లో నిలబడలేకపోయాడు.
శ్రేయస్ అయ్యర్ డక్ అవుట్ గా నిలిచాడు. వదేరా 10 పరుగులు, మ్యాక్స్వెల్ 7 పరుగులు, సూర్యoస్ 4 పరుగులు, యాన్సన్ 1 పరుగు.. ఇలా వరుస వికెట్లు పడడంతో పంజాబ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. 9వ వికెట్ కు శశాంక్ సింగ్ 17 బంతుల్లో 18 పరుగులు రాబట్టడంతో 100 పరుగులు దాటగలిగింది. కానీ 16 ఓవర్లలోపే పంజాబ్ జట్టు కుప్ప కూలిపోయింది. ఇలా మొత్తంగా 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీంతో 112 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేదించేస్తుంది అనుకున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఊహించని దెబ్బను ఎదుర్కొంది. చేదనలో 7 పరుగులకే ఓపెనర్లు కుప్ప కూలి పోయారు. సునీల్ నరేన్ 5 పరుగులు, డికాక్ 2 పరుగులతో పెవిలియన్కు చేరారు. ఆ తరువాత రఘువంశి, రహనే (17) నిలవడంతో కోల్కతా స్కోర్ బాగానే సాగింది. కేవలం రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసేసింది.
గెలుపుకు మరికొన్ని పరుగులే రావాల్సి ఉండగా వరుస వికెట్లతో చేతులెత్తేసింది. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ చాహల్ తన మాయజాలంతో వరుస వికెట్లు పడగొట్టాడు. తన ఓవర్లో రహనా, రఘువంశీలన అవుట్ చేశాడు. ఆ తర్వాత కూడా రింక్ సింగ్ ను (2) పరుగులకు, రమన్దీప్ ను (0) అవుట్ చేసి కోల్కత్తాకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఇలా వరుస వికెట్లతో 15.1 ఓవర్లలో కేకేఆర్ జట్టు 95 పరుగులు కి ఆల్ అవుట్ గా నిలిచింది. దీంతో ఈ ఊహించని విజయం పంజాబ్ కింగ్స్ సొంతమైంది.