Coolie : ‘కూలీ’ తెలుగు హక్కుల కోసం భారీ డిమాండ్..

రజినీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం ‘కూలి’. స్టార్ అండ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్‌కు అదిరిపోయే రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

జైలర్ మూవీతో సత్తా చాటిన రజినీ కాంత్‌.. ఆ తర్వాత వెట్టయాన్ అనే సినిమాతో ప్రేక్షకుల్ని అలరించాడు. ఇప్పుడు ఆయన్ను నెక్ట్స్ మూవీలో ఏ లుక్ లో చూడబోతున్నామనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది. ఇప్పటికే రజినీ కాంత్ తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసేశాడు.

మిగిలి ఉన్న షూటింగ్‌ను లోకేష్ కనగరాజ్ త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇందులో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సైతం కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఆగష్టు 14న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని గతంలో మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ నేపథ్యంలో ఈ మూవీ తెలుగు హక్కులపై భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని భారీ రేటుకు కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ తెలుగు రైట్స్‌ కోసం దాదాపు రూ40 కోట్ల వరకు మేకర్స్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇదో పెద్ద అమౌంట్ అనే చెప్పాలి. ఒకవేళ ఇది రూ.40 కోట్లకు అమ్ముడుపోయిందంటే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్లకు మించి కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది. అప్పుడే బాక్సాఫీసు హిట్‌ అందుకునే అవకాశం ఉంటుంది.

తరవాత కథనం