ఐపీఎల్ 2025 సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తడబడుతుంది. గత ఏడాది లీగ్ దశలో సెకండ్ ప్లేస్ లో నిలిచిన ఈ జట్టు ఈ ఏడాది సీజన్ లో కింద నుంచి రెండో ప్లేస్ లో ఉంది. స్టార్ బ్యాటర్లున్న ఆ జట్టు గెలవలేని పరిస్థితి ఏర్పడింది. నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడ్డాయి. ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ జట్టు చేతులెత్తేసింది. ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు అదరగొట్టేసింది. ఓవైపు బ్యాటింగ్ లోను మరోవైపు బౌలింగ్ లోను దుమ్ము దులిపేసింది.
మొదటగా బ్యాటింగ్ కు దిగిన సన్రైజర్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ 28 బంతుల్లో 40 పరుగులు రాబట్టాడు. అలాగే క్లాసేన్ 28 బంతుల్లో 37 పరుగులు చేశాడు. వీరు తప్పించి సన్రైజర్స్ జట్టులో మరెవరు ఎక్కువ స్కోర్స్ చేయలేకపోయారు. ఒకానొక సమయంలో సన్రైజర్స్ జట్టు 150 పరుగులు అయినా చేస్తుందా అనే అనుమానాలు కలిగాయి. కానీ అనికేత్, కెప్టెన్ కమింగ్ దూకుడుగా ఆడి 162 పరుగులు సాధించారు.
లక్ష్య చేదనకు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు కూడా మెల్లమెల్లగా తడబడుతూ ఆడింది. రెండు ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. 16 బంతుల్లో 26 పరుగులు రాబట్టాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ సైతం చెలరేగిపోయాడు. 15 బంతుల్లో 26 రన్స్ చేశాడు. దీంతో 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ముంబై జట్టు 117 పరుగులు చేసింది.
అయితే వరుసగా విల్ జాక్స్, సూర్య కుమార్ యాదవ్ అవుట్ అయ్యారు. దీంతో అంతా తారుమారు అయింది. కానీ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ దుమ్ము దులిపేశారు. పాండ్యా 9 బంతుల్లో 21 పరుగులు చేసి అదరగొట్టేసాడు. తిలక్ వర్మ 17 బంతుల్లో 21 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచి విన్నింగ్ పూర్తి చేశాడు. ఇలా ముంబై జట్టు 18.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది