ప్రస్తుత కాలంలో జుట్టు రాలిపోవడం, జుట్టు చివర్లు చిట్లపోయి పెరుగుదల ఆగిపోవడం, జుట్టు మెరుగుదల కనిపించకపోవడం వంటివి ఎన్నో సమస్యలు చాలామందిలో తలెత్తుతున్నాయి. దీంతో కొందరు రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడి మరింత సమస్యల్లో పడుతున్నారు. కెమికల్ ప్రొడక్ట్స్ కారణంగా జుట్టు సమస్య ఆగకపోగా మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందువల్ల మీరు ఇలా అయిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్డు మాస్క్
దెబ్బతిన్న జుట్టువారికి ఈ మాస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల పాడైపోయిన జుట్టు ను సాధారణ స్థితికి తీసుకురావచ్చు. దీని కోసం గుడ్డు మాస్క్ ఉపయోగించాలి. ఇందులో ప్రోటీన్, లేసితిన్ ఉంటాయి. దీనివల్ల జుట్టు సమస్య తగ్గుతుంది.
దీనికోసం ఒకటి లేదా రెండు గుడ్లును కొట్టి అందులో ఒక స్పూన్ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె వేసి కలపాలి. ఆ తర్వాత తడి జుట్టుకు అప్లై చేయాలి. 20 నుంచి 30 నిమిషాలు ఉంచిన తర్వాత చల్లని నీటితో తుడిచి షాంపుతో స్నానం చేసేయాలి.
అరటి- కొబ్బరి నూనె మాస్
అరటిపండు జుట్టును చాలా స్మూత్ గా చేస్తుంది. అందువల్ల దీన్ని కొబ్బరి నూనెతో మాస్క్ చేసి వాడటం వల్ల జర్లుగా మారిన జుట్టు సమస్య తగ్గుతుంది.
దీనికోసం మీరు అరటిపండును తీసుకొని గుజ్జుగా చేసేయాలి. దానిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి కలపాలి. అలా దాన్ని జుట్టుకు రాసి 20 నుంచి 30 నిమిషాలు ఉంచాలి. అనంతరం చల్లటి నీటితో కడిగేయాలి.
అవకాడో- తేనె మాస్క్
పొడిగా లేదా జీవం లేని జుట్టుకు అవకాడో తేనె మాస్ ఎంతో ఉపయోగకరము. వీటిలో విటమిన్లు, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అలాగే తేనెను వాడటం వల్ల జుట్టులో తేమను నింపుతాయి.
దీనికోసం మీరు ఆవకాడోను మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. అందులో ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. జుట్టుకు బాగా పట్టించి 30 నిమిషాలు ఉంచాలి. అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలకు చెక్ పెట్టి.. పొడవుగా, అందంగా పెరిగేలా చేసుకోవచ్చు.