bhu bharati portal: ‘భూ భారతి’ పోర్టల్ సేవలు – భూమి వివరాలను చెక్ చేసుకోండిలా?

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం ఇటీవల అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే “భూ భారతి”. పైలెట్ ప్రాజెక్టుగా భూ భారతి సేవలను అమల్లోకి తీసుకొచ్చారు. దీనితోపాటు భూభారతి పోర్టల్ కూడా స్టార్ట్ అయింది. ఎక్కువగా భూముల రిజిస్ట్రేషన్లు, అలాగే భూముల నిర్వహణ వంటి అంశాలన్నీ భూ భారతి పోర్టల్ ఆధారంగానే జరగనున్నాయి.

ఈ సేవలు ఏప్రిల్ 14 నుంచి పైలెట్ ప్రాజెక్టుగా కేవలం నాలుగు మండలాల్లో మాత్రమే ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ భూభారతి సేవలను అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తుంది. కొత్తగా వచ్చిన ఈ భూ భారతి పోర్టల్ లో ట్రాన్సాక్షన్స్ సేవలతో పాటు ఇన్ఫర్మేషన్ సేవలు కూడా ఉన్నాయి.

ట్రాన్సాక్షన్స్ సేవలు

లావాదేవీల విభాగంలో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్, ఆర్ ఓ ఆర్, నాలా, అప్పీల్, కరెక్షన్, భూముల వివరాలుతోపాటు ఇతర సేవలు ఉన్నాయి.

ఇన్ఫర్మేషన్ సేవలు

ఇన్ఫర్మేషన్ విభాగంలో భూముల వివరాలు, నిషేధిత భూములు, భూములు మార్కెట్ వ్యాల్యూ, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు.

చెక్ చేసుకునే విధానం

ముందుగా భూ భారతి అధికారిక పోర్టల్ ఓపెన్ చేయాలి.

ఆ తర్వాత హోం పేజీలో కనిపించే ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి.

అక్కడ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మరో పేజ్ ఓపెన్ అవుతుంది.

అక్కడ సర్వే నెంబర్ లేదా పాస్ బుక్ ఆధారంగా భూమి వివరాలు చెక్ చేసుకోవచ్చు.

సర్వే నెంబర్ తో చెక్ చేయాలంటే జిల్లా పేరు మండలం పేరు గ్రామం ఎంచుకోవాలి.

పాసుబుక్ చెక్ చేయాలనుకుంటే పాస్ పుస్తకం నెంబర్ తో పాటు కింద ఉండే కోడ్ను ఎంటర్ చేయాలి.

తరవాత కథనం