ఆర్సిబి జుట్టుకు ఏమైంది. పొరుగు గడ్డపై దుమ్ము దులిపేస్తున్న జట్టు.. సొంత గడ్డపై చేతులు ఎత్తేస్తోంది. ఇప్పటికే సొంత స్టేడియంలో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన ఆర్సీబీ జట్టు నిన్నటి మ్యాచ్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ అది కూడా ఆర్సిబి జట్టు చేజార్చింది. దీంతో చిన్న స్వామి స్టేడియానికి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నిన్న ఆర్ సి బి వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ చాలా లేటుగా ప్రారంభమైంది. కేవలం 14 ఓవర్లకే మ్యాచ్ను కుదించారు. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు ఆర్సిబి జట్టు దిగింది. వర్షం కారణంగా నిర్దేశించిన 14 ఓవర్లలో ఆర్సిబి జట్టు 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.
తక్కువ ఓవర్లు కావడంతో అర్సిబి బ్యాటర్లు మొదటి నుంచి దూకుడుగా ఆడారు. ఓపెనర్లు గా వచ్చిన ఫిల్ సాల్ట్, కోహ్లీ మొదటి నుంచి దూకుడు పెంచారు. కానీ పంజాబ్ కింగ్స్ బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయారు. సాల్ట్ 4 పరుగులు, విరాట్ 1 పరుగు, కెప్టెన్ రజత్ పాటిదా 23 పరుగులు, లివింగ్ స్టన్ 4 పరుగులు, జితేష్ 2 పరుగులు చేసి చేతులెత్తేశారు. ఒకానొక సమయంలో ఆర్సిబి జట్టు కనీసం 50 నుంచి 60 పరుగులైన చేస్తుందా అనే అనుమానాలు కలిగాయి.
కానీ టిమ్ డేవిడ్ తన విశ్వరూపం చూపించాడు. ఆర్సిబి పరువును నిలబెట్టాడు. వరుస వికెట్లు కోల్పోయిన తన దూకుడు ఆటతో పరుగులు వర్షం పెట్టించాడు. చివరి ఓవర్ లో అతడు బాదిన సిక్స్ లు మామూలుగా లేవు. మ్యాచ్ కే హైలైట్ గా నిలిచాయి. వరుసగా సిక్స్ లతో దుమ్ము దులిపేశాడు. 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఈ లక్ష్య చేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ అలవోకగా మ్యాచ్ ను గెలుస్తుంది అని అంతా భావించారు. తక్కువ స్కోరే కదా ఇలా కొట్టి అలా వెళ్ళిపోదాం అని పంజాబ్ కింగ్స్ జట్టు అనుకుంది. కానీ అక్కడ అంత ఈజీగా ఏం జరగలేదు. దూకుడు గా ఆడే క్రమంలో పంజాబ్ కింగ్స్ జట్టు కూడా సత్తకిల్ల పడింది. ఓపెనర్ లో ప్రభ సిమ్రాన్ 13 పరుగులు, ప్రియాంస ఆర్య 16 పరుగులు చేసి ఎవిలియన్కు చేరారు.
ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 7 పరుగులు, ఇంగ్లిశ్ 14 పరుగులు చేశారు. వీరు కూడా చేతులెత్తేశారు. దీంతో పంజాబ్ జట్టు 8 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. ఆర్సిబి జట్టులో ఆశలు చిగురించాయి. కానీ ఆ అసలు ఎక్కువసేపు నిలవలేకపోయాయి. నేహాల్ వదెరా భారీ షాట్లతో పరుగులు రాబట్టాడు. చివరకు స్టయినిస్ సిక్స్ తో విన్నింగ్ పూర్తి చేశాడు. దీంతో ఆర్సిబి జట్టు వరుసగా మూడోసారి సొంత గడ్డపై ఓటమి చదివి చూసింది