తమిళ స్టార్ హీరో సూర్య మరో సరి కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. పిజ్జా అనే హర్రర్ మూవీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తో “రెట్రో” అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో సూర్య సరసన నటి పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మేకర్స్ వరుస అప్డేట్లతో సినీ ప్రియులని, అభిమానులను అలరిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్ అప్డేట్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి మేకర్స్ మరో సర్ప్రైజ్ అందించారు. మే 1న ఈ సినిమా రిలీజ్ కానుండగా తాజాగా రెట్రో ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
చెన్నైలో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్లో దీనిని లాంచ్ చేశారు. రెట్రో లో సూర్య యాక్టింగ్ అదిరిపోయింది. డిఫరెంట్ లుక్ లో కనిపించి దుమ్ము దులిపేశాడు. తన మాస్ యాక్షన్ తో అదరగొట్టేశాడు. ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో దూసుకుపోయింది. అలాగే సూర్య, పూజ హెగ్డే ల రొమాన్స్ లవ్ అందరిని అట్రాక్ట్ చేసింది.
అయితే ఈ ట్రైలర్ ద్వారా మూవీ కథ ఏంటనేది పెద్దగా రివిల్ కాకపోవడం గమనార్హం. దీంతో మరింత ఆసక్తి పెరిగింది.. యాక్షన్, లవ్, వైలెన్స్ కలిపి వస్తున్న ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయింది అని చెప్పాలి. ఈ చిత్రాన్ని 2d ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ స్టూడియోస్ కలిసి నిర్మించాయి. కొత్తంగా సినిమా థియేటర్లలో 2 గంటల 48 నిమిషాల రన్ టైం తో రానుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.