RCB Vs PBKS: ‘కింగ్స్’ను చెండాడేసిన కోహ్లీ.. ఆర్సీబీ ఖాతాలో ఐదో విజయం

ఐపీఎల్ 2025 సీజన్ హోరాహోరిగా జరుగుతుంది. ఇందులో భాగంగానే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య తగ్గా పోరు మ్యాచ్ జరిగింది. ఉత్కంఠ భరితమైన మ్యాచ్లో ఆర్సిబి జట్టు ఘనవిజయం సాధించింది. దాదాపు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ, పడిక్కల్ అర్థ సెంచరీలతో అదరగొట్టేశారు. దీంతో ఆర్సిబి ఖాతాలో ఐదో విజయం ఖరారు అయింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించింది. కింగ్స్ ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. దాన్ని బట్టి దాదాపు 200 పరుగులైన సాధిస్తుందని అంతా భావించారు. ఓపెనర్లు ప్రియాంస్ ఆర్య 15 బంతుల్లో 22 పరుగులు రాబట్టాడు.

సిమ్రాన్ సింగ్ 17 బంతుల్లో 33 పరుగులతో మంచి ఆరంభం అందించారు. కానీ మిగతా బ్యాటర్ లు చేతులెత్తేయడంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. జోష్ ఇంగ్లిష్ 29 పరుగులు, శశాంక్ సింగ్ 31 పరుగులు, మార్కో 25 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 6 పరుగులు.. ఇలా మొత్తంగా 157 పరుగులు సాధించారు.

ఈ లక్ష్య చేదనకు దిగిన ఆర్సిబి జట్టు మొదట్నుంచి అదరగొట్టేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ సాల్ట్ ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రిజ్ లోకి వచ్చిన పడికల్ అదరగొట్టేసాడు. కోహ్లీ, పడికల్ కలిసి పరుగుల వరద పెట్టించారు. ఫోర్లు సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో మెరిశారు.

విజయానికి చేరువలో ఉన్న సమయంలో పడిక్కల్ అవుట్ అయ్యాడు. 30 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసిన అతడిని హర్ ప్రీత్ అవుట్ చేశాడు. పడికల్ 35 బంతుల్లో 61 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. ఆ తర్వాత కెప్టెన్ రజత్ పట్టిదార్ క్రీజులోకీ వచ్చాడు. వీరిద్దరూ మంచి అండర్స్టాండింగ్ తో పరుగులు రాబట్టారు.

విరాట్ కోహ్లీ 43 బంతుల్లో హౌఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా రన్స్ చేసి rcb కి విజయాన్ని అందించాడు. కోహ్లీ 54 బంతుల్లో 73 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో rcb జట్టు 18.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది. ఈ గెలుపుతో ఆర్సిబి ఖాతాలో 5వ విజయం నమోదయింది.

తరవాత కథనం