రామాయణం ఇతిహాసాలను ఇప్పటికే సినిమాలు, సీరియల్ రూపంలో ఎన్నో రకాలుగా చూసాం. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా వీటిని వీక్షించాం. ఈ రామాయణాన్ని ప్రస్తుత జనరేషన్ వారికి కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో దర్శకులు రకరకాలుగా తెరకెక్కిస్తున్నారు. గతం నుంచి ఇప్పటివరకు రామాయణాన్ని ఎన్నో విధాలుగా రూపొందించారు.
కొత్త తరం వారికి కొత్తగా చూపించాలని తెరకెక్కిస్తున్నాడంతో సినీప్రియులు కూడా చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ప్రభాస్ సైతం ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామాయణం ఇతివృత్తంతో వచ్చిన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా విమర్శలకు గురైంది.
కాగా ఇప్పుడు రామాయణాన్ని మరోసారి తెరకెక్కించేందుకు ఇంకొక డైరెక్టర్ సిద్ధమయ్యారు. ఈసారి రామాయణాన్ని ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా బాలీవుడ్లో తెరకెక్కించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి రామాయణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇందులో రన్బీర్ కపూర్, సాయి పల్లవి, కే జి ఎఫ్ హీరో ఎస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ కనిపించబోతున్నారు. ఇందులో ఇంకా మరి కొంతమంది నటీనటులు బాగమయ్యారు. సూర్పనకగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు బాబి డియోల్ సైతం కీలక పాత్రలో పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మొదటి పార్ట్ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు రెండో భాగానికి సంబంధించి షూటింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వచ్చేనెల అంటే మే ఆఖరి నుంచి రామాయణ పార్ట్ 2 షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో మొదటగా సీత పాత్రకు సంబంధించి.. అశోకవనం ఎపిసోడ్స్ చిత్రీకరించినట్లు సమాచారం.
ఆ తర్వాత జూన్ నెల నుంచి రన్బీర్ రాముడు పాత్రకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలిసింది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని మొదటి పార్ట్ ను వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నారు. సెకండ్ పార్ట్ ను 2027 దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.