ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ పోటాపోటీగా జరుగుతుంది. టైటిల్ విన్నింగ్ కోసం ఇరుజట్లు హోరా హోరిగా తలపడుతున్నాయి. ఇందులో భాగంగానే నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఘన విజయం సాధించింది. కోల్కత్తా జట్టును దాని సొంత గడ్డపై అలవోకగా ఓడించింది. దీంతో ఆరో విజయాన్ని గుజరాత్ జట్టు తన ఖాతాలో వేసుకుంది. ఇక కేకేఆర్ జట్టు 5వ ఓటమిని చవిచూసింది.
తొలి ఇన్నింగ్స్ లో గుజరాత్ ఓపెనర్లు దుమ్ము దులిపేస్తారు. కెప్టెన్ శుభమన్ గిల్, సాయి సుదర్శన్ ఓపెనర్లుగా చెల్లరేగిపోయారు. కోల్కత్తా బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా వీరిద్దరూ పూర్తి ఆధిపత్యాన్ని చలాయించారు. అదిరిపోయే షాట్లతో బౌలర్లకు చెమటలు పట్టించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో దుము దులిపేశారు.
గిల్ 34 బంతుల్లో హఫ్ సెంచరీ చేయగా.. సుదర్శన్ 33 బంతుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇలా గుజరాత్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు సాధించింది. కెప్టెన్ శుభమన్ గిల్ 55 బంతుల్లో 90 పరుగులు చేశాడు, సాయి సుదర్శన్ 36 బంతుల్లో 52 పరుగులు, జోష్ బట్లర్ 23 బంతుల్లో 41 పరుగులు సాధించారు.
ఈ లక్ష్య చేదనకు దిగిన కేకేఆర్ జట్టు మొదట్నుంచి తడబడింది. తొలి ఓవర్ లోనే మొదటి వికెట్ కోల్పోయింది. కాసేపు సునీల్ నరేన్ మెరుపులు మెరుపించాడు. కానీ ఎక్కువ సమయం నిలవలేకపోయాడు. ఒకానొక సమయంలో కెప్టెన్ రహేనే వరుస పరుగులు రాబట్టాడు. మంచి షార్ట్ లాడుతూ అలరించాడు. కానీ అతడికి మరొక సహకారం లేకపోవడంతో ఏం చేయలేకపోయాడు.
వైస్ కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ సైతం క్రీజ్ లో చాలా సేపు ఉన్నాడు. అతడు కూడా బ్యాట్ జులిపించలేకపోయాడు. ఇక భారీ షాట్లు ఆడే రసెల్ సైతం చేతులెత్తేశాడు. స్పీడ్ బ్యాటర్ రింకు సింగ్ నీరసించిపోయాడు. ఇలా మొత్తంగా బ్యాటర్లందరూ చేతులు ఎత్తేశారు.
గుర్బజ్ 1 పరుగు, నరేన్ 17 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 14 పరుగులు, రహనే 50 పరుగులు, రింకు సింగ్ 17 పరుగులు, రమన్దీప్ 1 పరుగు, మొయిన్ అలీ డక్ అవుట్, రఘువంశి 27 పరుగులు సాధించారు. ఇలా మొత్తంగా నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుజరాత్ జట్టు 39 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది.