నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. మొదటి పార్ట్ కంటే ఉత్కంఠ భరతమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు వరుస ప్లాపులతో సతమతమైన బాలయ్యకు అఖండ సినిమా మంచి కం బ్యాక్ ఇచ్చింది.
బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. ఇప్పుడు సీక్వల్ తో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేసేందుకు బాలయ్య సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఒక పవర్ఫుల్ రాజకీయ నాయకురాలుగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించ బోతున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గానే దర్శకుడు బోయపాటి శ్రీను ఆమెను కలిసి స్టోరీ చెప్పగా.. విజయశాంతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ పై ఓ న్యూస్ నెట్టెంట తెగ వైరల్ అవుతుంది. అఖండ 2 టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అన్ని పూర్తి చేసుకొని అనుకున్న సమయానికే అంటే బాలయ్య బాబు పుట్టినరోజున ఈ టీజర్ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాల్ చేస్తున్నట్లు సమాచారం.
దీన్ని బట్టి చూస్తే బాలయ్య బర్త్డే జూన్ 10న టీజర్ రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది. చిత్ర బృందం నెల రోజుల షెడ్యూల్ కోసం జార్జియాకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొత్తం జార్జియాలోనే షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం. దీంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.