ఐదు నెలల్లో మీ ఫైనాన్సియల్ స్టేటస్ సెట్ చేసే టెక్నిక్- రాకేష్‌లా మీరూ మారండి

రాకేష్‌, శిరీష ఇద్దరు ఒకే ఆఫీస్‌లో పని చేస్తున్నారు. రాకేష్ టీం లీడ్‌, శిరీష ఫ్రంట్‌ ఆఫీస్‌ ఎంప్లాయి. రాకేష్‌ జీతం యాభైవేలకుపైనే ఉంటుంది. అందులోనూ బ్యాచిలర్‌. శిరీషకు ఏడాది క్రితం పెళ్లై. ఆమె శాలరీ 20 వేలే. ఆమె భర్త కూడా ఉద్యోగే. ఆయన శాలరీ కూడా దాదాపు పాతికవేలు ఉంటుంది. అయితే నెలాఖరుకు వచ్చేసరికి రాకేష్ జేబు ఖాళీ అవుతుంది. డబ్బులు అవసరం అయితే శిరీషను అడుగుతుంటాడు. మళ్లీ శాలరీ వచ్చిన వెంటనే ఇచ్చేస్తుంటాడు. వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఎంత కావాలన్నా ఠక్కున ఇస్తుంది. ఇది రాకేష్‌కు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది.

మీరు సరిగ్గా గమనిస్తే ఇలాంటి రాకేష్‌లు ప్రతి ఆఫీస్‌లో ఉంటారు. కొందరు ఫ్యామిలీ ఖర్చుల కోసం అప్పులు చేస్తుంటే.. మరికొందరు సొంత అవసరాల కోసం ఇబ్బంది పడుతుంటారు. వ్యక్తిగత ఫైనాన్సింగ్ సరిగా ఉంటే మన జీతం ఎంత అనే ఆలోచన లేకుండా సాగిపోతుందీ మన బతుకు బడ్జెట్‌.

వ్యక్తిగత ఫైనాన్స్ అనేది ఏదో బ్రహ్మపదార్థం అనుకుంటే పొరపాటే. మనం రోజువారిగా పెట్టే ఖర్చులు, నెల వారిగా చేసే చెల్లింపులు, ఏటా మనం వెచ్చించే డబ్బులను ఎంత జాగ్రత్తగా నిర్వహిస్తున్నామనేది ముఖ్యం. కొందరు కోట్లు సంపాదిస్తున్నా వారి వద్ద సమయానికి వంద రూపాయలు ఉండటం చాలా కష్టమైపోతుంది. కానీ కొదరి జీతం పది వేలు అయినప్పటికీ క్షణాల్లో వారి వద్ద లక్షల రూపాయాలు కావాలన్నా ఉంటాయి. అదే వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణ. ఇక్కడ శిరీష, రాకేష్‌ది ఇదే పరిస్థితి.

కొన్ని రోజుల తర్వాత రాకేష్‌కు పెళ్లి సెట్ అయింది. మంచి శాలరీ వస్తున్నా ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడంతో వచ్చిన డబ్బులు ఖర్చులకే సరిపోక అప్పులు చేసేటోడు. పెళ్లి అనేసరికి రాకేష్‌లో భయం మొదలైంది. వెంటనే శిరీషతో మాట్లాడి అసలు ఇంత తక్కువ శాలరీతో ఎలా మేనేజ్ చేస్తున్నావని ఆ సీక్రెట్ ఏంటో చెప్పమని అడిగాడు.

ఆర్థిక నిర్వహణ అంటే ఏంటో పూర్తిగా మర్చిపోయి బతుకుతున్న రాకేష్‌కు నోటీతో విషయాన్ని చెబితే లాభం లేదని శిరీష 5 పుస్తకాలు సూచించింది. కాస్త శ్రద్ధతో వాటిని చదివితే కచ్చితంగా పెళ్లి అయ్యే నాటికి మార్పు వస్తుందని లేకుంటే మాత్రం ఏడాదిలో విడాకులు ఖాయమంటూ బెదిరించింది.

రాకేష్‌కు శిరీష చెప్పిన పది పుస్తకాలు ఇక్కడ మీకోసం ఇస్తున్నాం మీరు చదవండీ మీ ఆర్థిక నిర్వహణ కెపాసిటీని పెంచుకొని ఆర్థికంగా స్టేబుల్ అవ్వాడి.

1. ది టోటల్ మనీ మేక్ఓవర్ (The Total Money Makeover)
నిజజీవితంలో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న వాళ్లు, పడి లేచిన వ్యక్తుల లైఫ్‌ స్టోరీలతో ఉన్న పుస్తకం టోటల్ మనీ మేక్ఓవర్. దీన్ని డేవ్ రామ్సే (Dave Ramsey) రాశారు. చాలా సూచనలు, ఐడియాలతో కూడిన ఈ పుస్తకం ఆర్థిక నిర్వహణకు గైడ్ లాంటిది.

కంటికి నచ్చి వస్తువును కొనుక్కుంటూ వెళ్తే ప్రపంచంలోని బ్యాంకుల్లో డబ్బు అంతా ఇచ్చినా సరిపోదు. అలాగని పూర్తిగా కోరికలను చంపుకొని ఏ అవసరాలను తీర్చుకోకుండా బతకడం కూడా వ్యర్థం. కానీ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ డబ్బుపై నియంత్రణ సాధించడం ఆర్థిక నిర్వహణలో ప్రథమ సూత్రం. ఇదే తెలియకే చాలా మంది నచ్చినట్టు బతకాలనే కాన్సెప్టుతో అప్పులుపాలవుతుంటారు. ఇలాంటి వారికి ఈ పుస్తకం దిక్సూచిలా ఉపయోగపడుతుంది.

డబ్బుపై నియంత్రం సాధిస్తూనే అవసరాలను మన కోరికలను ఎలా తీర్చుకోవాలని ఉదాహరణలతో వివరించారు రచయిత. ఈ పుస్తకం చదివిన తర్వాత డబ్బు విషయంలో ఇతర అవసరాల విషయంలో మీ దృక్పథమే మారిపోతుందంటే నమ్ముతారా? మరెందుకు ఆలస్యం ఇవాళ ఈ పుస్తకం చదవడం ప్రారంభించండి.

2. యు ఆర్ సో మనీ: లివ్‌ రిచ్‌ ఈవెన్ వెన్‌ యూఆర్‌ నాట్‌(You’re So Money: Live Rich, Even When You’re Not)
కొందర్ని చూస్తే ఎలా బతుకుతున్నాడ్రా అంటాం. మరికొందర్ని చూస్తే ఇలా బతకాలిరా అనిపిస్తుంది. ఇంకొందరు మన మధ్య లేకపోయనా ఎలా బతికేవాడురా అనుకుంటాం. ఇందులో ఆఖరి రెండు కేటగిరికి మీరు చెందాలంటే ముందు యు ఆర్ సో మనీ అనే పుస్తకాన్ని మీరు చదవాలి. ఫర్నూష్ తోరాబి రాసిన ఈ పుస్తకం… నిత్యం జీవితంలో మీరు బడ్జెటింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చెబుతుంది.

మనం జనరల్‌గా ప్రభుత్వాలు, పెద్ద పెద్ద కంపెనీలు వద్దే ఈ బడ్జెట్ అనే మాట వింటూ ఉంటాం. కానీ ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి కూడా బడ్జెట్ అనేది చాలా అవసరం. జనరల్‌గా ప్రభుత్వాలు బడ్జెట్ పెట్టిన తర్వాత నిధులు సేకరిస్తాయి. కానీ మీరు మాత్రం ఉన్న డబ్బులతో బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. లేకుండా ఆర్థిక సమస్యలు మీ డోర్ బెల్ కొడతాయి. దాని ఆధారంగానే మన ఖర్చులు, పొదుపులు భవిష్యత్ అవసరాలు తీర్చుకోవాలి. ఇలా బడ్జెట్ రూపొందించి ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవడానికి ఫర్నూష్ తోరాబి రాసిన యు ఆర్ సో మనీ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది.

ఆర్థిక క్రమశిక్షణ నేర్పే పుస్తుకం అంటే మొత్తం సీరియస్ మేటర్ ఉంటుందనే భ్రమ పడకండీ. మీ చుట్టూ రోజూ మీరు చూసే కొన్ని ఘటనలను వ్యక్తులను ఉదాహరణలుగా చూపిస్తూ హాస్యధోరణిలో ఆర్థిక నిర్వహణ పాఠాలు నేర్పుతారు ఈ పుస్తకంలో. డబ్బుల విషయంలో అతి జాగ్రత్త ప్రమాదకరమని రచయిత చెబుతారు. ధనవంతులుగా జీవించడం, చనిపోవడం ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో హాస్యాస్పదంగా చెప్పారు.

3. ఐ విల్ టీచ్‌ యూ టూ బి రిచ్‌ (I Will Teach You to Be Rich )
20 నుంచి 35 ఏళ్ల ఆర్థిక నైపుణ్యాన్ని సాధించగలిగితే వారు లైఫ్‌లో బాగా సెటిల్ అవుతారు. ఈ ఏజ్‌లో వేసే తప్పటడుగులే తర్వాత లైఫ్‌లో మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. అందుకే డబ్బులు ఖర్చు విషయంలో ఈ ఏజ్‌ వాళ్లు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు కూడా చెబుతుంటారు. అలాంటి వాళ్లకు రమిత్ సేథి రాసిన ఐ విల్ టీచ్‌ యూ టూ బి రిచ్‌ పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రభుత్వ ఉద్యోగి తప్ప ఏ ప్రైవేటు ఉద్యోగి కూడా జీవితాంతం అంటే రిటైర్ అయ్యే వరకు ఉద్యోగం చేయాలని అనుకోడు. ఏదో సొంతంగా బిజినెస్సో, ఇంకా ఏదైనా ఇతర పనో చేయాలని కోరుకుంటాడు. అలాంటి వాళ్లకు ఈ పుస్తకం గైడ్‌లా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం బ్యాంకింగ్, పొదుపు, పెట్టుబడి, బడ్జెట్ అనే నాగులు అంశాలను విపులుగా చర్చిస్తుంది. మీ ఆర్థిక విజయానికి దశల వారీ ఉపయోగపడే ఆచరణాత్మక మార్గదర్శి ఈ పుస్తకం అనుకోవచ్చు. నేటి జెన్‌జీ యువత ఈ పుస్తకం చదవడం చాలా అవసరం.

4. రిచ్ డాడ్ పూర్ డాడ్(Rich Dad Poor Dad)
ప్రపంచంలో అమ్ముడుపోతున్న పుస్తకాల్లో టాప్‌లో ఉంటుందీ పుస్తకం. ఇద్దరు తండ్రుల కథ మనకు పరిచయం లేని ఎన్నో అనుభూతులను పరిచయం చేస్తుంది. బాగా చదువుకున్న తండ్రి ఒకరు.. బడి మానేసి అప్పులు, ఆర్థిక కష్టాలతో జీవితాన్ని లీడ్ చేస్తున్న మరో తండ్రి.. తమ బిడ్డలను పెంచే విధానం గురించి వివరించే పుస్తకమే ఈ రిచ్‌డాడ్‌ పూర్‌ డాడ్. మనకు జీవితంలో ఎదురయ్యే ప్రతి ఆర్థిక అనుభూతిని ఇందులో చర్చకు పెట్టాడు రచయిత రాబర్ట్ కియోసాకి(Robert Kiyosaki). డబ్బుకు సంబంధించిన అమూల్యమైన పాఠాలు అందిస్తుంది పుస్తకం.

5. ది మిలియనీర్ నెక్స్ట్ డోర్(The Millionaire Next Door)
డబ్బు మనిషికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అందుకే డబ్బులు బాగా ఉన్న వాడి ఆలోచనలు ఒకలా ఉంటాయి. మధ్య తరగతి వ్యక్తుల ఆలోచన మరోలా ఉంటాయి. పేదరికంలో ఉన్న వ్యక్తులు కొన్ని ఆలోచనలు చేయడానికి కూడా భయపడతారు. ఇలా మిలియనీర్‌లు ఎలా ఆలోచిస్తారు…వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు వివరించేదే థామస్ స్టాన్లీ, విలియం డాంకో రాసిన ది మిలియనీర్ నెక్స్ట్ డోర్.
ఒక కోటీశ్వరుడు మీ ఇంటిక పక్కనే ఉంటే ఎలా ఉంటుందో పుస్తకం చదువతున్నంత సేపు అలాంటి అనుభూతే కలుగుతుంది. మిలియనీర్ల అలవాట్లు ఎలా ఉంటాయి. డబ్బు పట్ల వారికి ఉన్న దృక్పథం ఏంటి అనేది రచయిత విశ్లేషించారు.

చాలా మంది సంపన్నలు తమ ఆదాయ వ్యయాలు బయటకు తెలియనీయకుండా జాగ్రత్తపడతారట. చాలా సింపుల్‌గా జీవించేందుకు ఇష్టపడతారని రచయితలు చెప్పుకొచ్చారు. మీరు రోజూ బస్‌ల్లో, ట్రైన్స్‌లో రోడ్డుపై నడుస్తున్నప్పుడు కనిపించే వ్యక్తుల్లో చాలా మంది కోటీశ్వరులు ఉంటారని రచయిత చెబుతారు. అలా సింపుల్‌గా ఉన్న వారినే ఐశ్వర్యం వరిస్తుందని ఈ పుస్తక రచయిత ఫీలింగ్.

ఇలా వివరించిన శిరీష… రాకేష్‌తో ఐదు పుస్తకాలు చదివించింది. అనుకున్నట్టుగానే రాకేష్‌లో మార్పు వచ్చింది. ఆరునెలల్లోనే రాకేష్‌ ఆఫీస్‌లు అప్పులు అడగడం మానేశాడు. పెళ్లి నాటికి కొంత డబ్బులను కూడా సేవ్ చేసుకున్నాడు. రాకేష్‌లా ఉన్న మీరు మారాలంటే ఈ పుస్తకాలను ట్రై చేయండి.

తరవాత కథనం