మహిళలు బారులు తీరుతున్న LIC పథకం- మరి మీరు అప్లై చేశారా? నెలకు 7వేలు ఇచ్చే అద్భుతమైన స్కీమ్‌?

LIC’s Bima Sakhi Yojana

LIC’s Bima Sakhi Yojana Apply:దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ ఎల్‌ఐసీ 2024 డిసెంబర్‌లో ప్రారంభించిన బీమా సఖి పథకం సూపర్‌హిట్‌ అయింది. భారీ సంఖ్యలో మహిళలు ఈ స్కీమ్‌లో చేరుతున్నారు. నెల వ్యవధిలోనే దాదాపు 50 వేల మందికిపైగా మహిళలు ఈపథకంలో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. దరఖాస్తు చేసుకున్నారు. మహిళల్లో సాధికారత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో శిక్షణతోపాటు స్టైఫండ్ కూడా ఇవ్వడంతో మహిళలు మరింత మంది ఈ పథకంలో చేరేందుకు ముందుకు వస్తున్నారు.

9డిసెంబర్‌ 2025న హర్యానాలోని పానిపట్‌లో ఎల్‌ఐసీ బీమా సఖీ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకంలో చేరేందుకు నెల రోజుల వ్యవధిలో దాదాపు 52,511 మంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో సగం మందికిపైగా మహిళలు నియామకపత్రాలు కూడా అందుకున్నారు.

LIC యొక్క బీమా సఖీ పథకం చాలా ప్రత్యేకమైంది. ఇందులో చేరిన మహిళలకు సాధికారత కల్పించేందుకు శిక్షణతో పాటు ఆదాయం కూడా వస్తుంది. బీమా సఖీ యోజన కింద మహిళలకు LIC ఏజెంట్‌గా మారడానికి పూర్తి శిక్షణ ఇస్తారు. దీంతో పాటు ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు స్టైఫండ్ ఇస్తారు. ఒక్కో ఏడాది దీన్ని తగ్గిస్తూ వస్తారు. మొదటి ఏడాదిలో ఈ పథకం కింద నెలకు రూ.7వేలు, రెండో ఏడాది రూ.6వేలు, మూడో ఏడాది రూ.5వేలు చొప్పున స్టైఫండ్ ఇస్తారు. పెట్టిన టార్గెట్స్ పూర్తి చేసిన వారికి కమీషన్ లభిస్తుంది. దీంతోపాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తారు.

3ఏళ్ల శిక్షణ
LIC బీమా సఖీ పథకం మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది స్టైపెండ్ ఆధారిత పథకం. ఇందులో చేరిన మహిళలకు మూడేళ్లపాటు ఎల్‌ఐసీ ఏజెంట్లుగా శిక్షణ ఇచ్చి, మొదటి నుంచి కొన్ని పాలసీలకు టార్గెట్‌లు పెట్టి స్టైఫండ్‌ ఇస్తారు. ఈ పథకంలో చేరడానికి 18 నిండి మహిళల నుంచి 70 ఏళ్లు పూర్తైన మహిళలు ఎవరైనా చేరవచ్చు. కనీస వాళ్లు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీని ఆధారంగా ఏ LIC ఏజెంట్ లేదా ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్న బంధువులు దరఖాస్తు చేయడానికి వీలు లేదు.

LIC యొక్క ఈ పథకంలో చేరడం సులభం
బీమా సఖీ యోజన కోసం దరఖాస్తును ఆన్‌లైన్‌లో చేయవచ్చు లేదా మీరు సమీపంలోని శాఖను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి మహిళ వయస్సు సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రం, 10వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికేట్ కాపీ ఇవ్వాలి. దరఖాస్తు చేసేటప్పుడు సరైన అప్లికేషన్ పూర్తిగా సమగ్రంగా ఫిల్ చేయాలి. ఒకవేళ అందులో ఏదైనా సమాచారం పూర్తిగా ఇవ్వకపోతే అలాంటి దరఖాస్తులు తిరస్కరిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలనుకునే వాళ్లు ముందుగా https://licindia.in/test2కి వెళ్లాలి. పేజీ దిగువకు వెళ్లి బీమా సఖి అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. వెంటనే అప్లికేషన్ ఫారమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అందులో అవసరమైన వివరాలను నింపాలి. అన్ని వివరాలను పూర్తి చేసిన తర్వాత మరోసారి సరి చూసుకొని క్యాప్చా నమోదు చేయాలి.

తరవాత కథనం