పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులతోపాటు మధ్య తరగతి కుటుంబాలకు సహాయం చేయడానికి ఈ పీఎంఏవై 2.0 పథకాన్ని రూపొందించారు. దీన్ని ఆగస్ట్ 9, 2024న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకం ప్రకారం కొత్తగా కోటి ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఒక్కో ఇంటికి రెండున్నర లక్షల రూపాయలు రాయితీ ఇస్తోంది.
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PM ఆవాస్ యోజన 2.0) కింద లబ్ధి పొందాలనుకునే వారి కోసం దీన్ని ప్రభుత్వం ప్రారంభించింది. పట్టణాల్లో నివశిస్తూ ఆర్థికంగా వెనకుబడిన వర్గాలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకాన్ని రూపొందించింది. వారు నిర్మించుకునే ఇంటికి ఆర్థికంగా సహాయ పడటమే ఈ పీఎంఏవై పథకం ప్రధాన లక్ష్యం.
పట్టణ ప్రాంతాల్లో EWS, మధ్యతరగతి కుటుంబాలకు సహాయం చేయడానికి రూపొందించిన ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆగస్ట్ 9, 2024న ఆమోదం తెలిపింది. ఈ ఐదేళ్లలో PMAY 2.0 ప్రకారం ప్రభుత్వం 1 కోటి కొత్త గృహాలను నిర్మించాలని భావిస్తోంది. వీటిలో ప్రతి యూనిట్‌కు రూ. 2.50 లక్షల ఆర్థిక రాయితీ ఇవ్వనుంది. పీఎంఏవై అర్బన్ చివరి దశలో 1.18 కోట్ల ఇళ్లు మంజూరయ్యాయని, అందులో 8.55 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు ఈ ఇళ్లను అందజేశామని కేంద్రం లెక్కలు చెబుతోంది.
ఈ పథకం ప్రయోజనం మీకు నాలుగు కేటగిరీల కింద అందిస్తున్నారు. వీటిలో బెనిఫిషియరీ-లెడ్ కన్‌స్ట్రక్షన్ (BLC), సరసమైన హౌసింగ్ ఇన్ పార్టనర్‌షిప్ (AHP), సరసమైన అద్దె హౌసింగ్ (ARH) వడ్డీ రాయితీ పథకం (ISS) ఉన్నాయి.
ఎలా దరఖాస్తు చేయాలి?
PMAY-U 2.0 కింద 1 కోటి కొత్త కుటుంబాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం, ముందుగా https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PmayDefault.aspxకి వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
ఇప్పుడు PMAY-U 2.0 కోసం అప్లై అనే బటన్‌పై క్లిక్ చేసి వివరాలు ఫిల్ చేయాలి. అనంతరం సబ్‌మిట్ బటన్ ప్రెస్ చేయాలి.
మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీకు అర్హత ఉందా లేదా అన్నది ఇక్కడే నిర్ణయించేస్తారు. మీరు అర్హులు కాకపోతే అంతకంటే ముందుకు వెళ్లేందుకు వీలు ఉండదు.
అర్హత ఉంటే తదుపరి ప్రక్రియకు వెళ్లే వీలు ఉంటుంది. అక్కడ మీరు మీ ఆధార్ నంబర్ పేరును నమోదు చేయాలి. అప్పుడు OTPని రిక్వస్ట్ చేసే బటన్‌పై ప్రెస్ చేయాలి.
సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది, దానిని నమోదు చేసిన తర్వాత మీరు తదుపరి ప్రక్రియపై క్లిక్ చేయాలి.
ఏ పత్రాలు అవసరం?
దరఖాస్తుదారు ఆధార్ వివరాలు (ఆధార్ నంబర్, ఆధార్ ప్రకారం పేరు, పుట్టిన తేదీ).
కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు (ఆధార్ నంబర్, ఆధార్ ప్రకారం పేరు, పుట్టిన తేదీ).
ఆధార్‌తో లింక్ చేసిన దరఖాస్తుదారు యాక్టివ్ బ్యాంక్ ఖాతా (ఖాతా నంబర్, బ్యాంక్ పేరు, బ్రాంచ్, IFSC కోడ్) వివరాలు.
ఆదాయ రుజువు (PDF ఫైల్ మాత్రమే పరిమాణం 200kb)
కులం రుజువు (SC, ST లేదా OBC విషయంలో). (PDF ఫైల్ మాత్రమే, పరిమాణం 200kb)
భూమి పత్రాలు (లబ్దిదారుల ఆధారిత నిర్మాణ BLC భాగం విషయంలో). (PDF మాత్రమే, ఫైల్ పరిమాణం 5mb)