IRCTC Ewallet: మీరు రైల్వే టికెట్ బుక్ చేసినప్పుడు పేమెంట్ గేట్వే దగ్గర చాలా మంది అనేక ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ టైంలో అయితే ఆ సమస్య మామూలుగా ఉండదు. టికెట్ బుకింగ్ ఒక వెబ్‌సైట్ నుంచి చేస్తుంటారు. పేమెంట్ మరో థర్డ్ పార్టీ యాప్‌కి కనెక్ట్ అవ్వాల్సి వస్తోంది. అందుకే టికెట్ బుకింగ్ టైంలో ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఐఆర్‌సీటీసీ సరికొత్త పరిష్కారం మార్గంతో వచ్చింది.
పేమెంట్ సమస్యలకు పరిష్కారం కోసమే IRCTC Ewallet
రైల్వే ప్రయాణికుల పేమెంట్ సమస్యల పరిష్కారానికి ఐఆర్‌సీటీసీ ఈ వ్యాలెట్ పేరుతో కొత్త యాప్ తీసుకొచ్చింది. ఇందులో నేరుగా డబ్బులు వేసకుంటే టికెట్ కోసం పేమెంట్ చేసేటప్పుడు క్షణాల్లో అయిపోతుంది. దీని వల్ల టికెట్లు ఇచ్చే వెబ్‌సైట్, పేమెంట్ వెబ్‌సైట్ ఒకటే కాబట్టి పని త్వరగా అవుతుంది. కొన్నిసార్లు టికెట్ క్యాన్సిల్ అయిన తర్వాత కానీ, టికెట్ బుక్ కాకపోయినా డబ్బులు కట్ అవుతుంటాయి అలాంటి సందర్భంలో కూడా ప్రయాణికులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఇలాంటి వాటికి కూడా ఈ వ్యాలెట్ పరిష్కార చూపనుంది.
వెయ్యి వరకు ఎంతైనా రీఛార్చ్ చేయవచ్చు
ఈ వ్యాలెట్‌ను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారానే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వందల రూపాయల నుంచి పది వేల వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇప్పటి వరకు అదనంగా ఎంతోకొంత కట్ అయ్యేవి ఇప్పుడు ఆ వాయింపు కూడా ఉండదు. ఈ యాప్ వల్ల రీఫండ్, క్యాన్సిల్, పేమెంట్ అన్నీ ఇన్‌టైంలో అవుతాయి.
ఎలా అయినా రీచార్జ్ చేయవచ్చు
ఈ-వ్యాలెట్ పూర్తి సురక్షితమైంది. మీరు ఈ వ్యాలెట్‌ను నెట్‌బ్యాంకింగ్ ద్వారా, డెబిట్, క్రెడిట్ కార్డు ఎలాగైనా రీచార్చ్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ వాడుకున్నందుకు ఈ సంస్థకు ఎలాంటి ఛార్జీలు కూడా చెల్లించాల్సిన పని లేదు. పూర్తిగా ఉచితంగానే సేవలు అందించనుంది.
ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత మీ ఐడీ, పాస్‌వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ IRCTC ఎక్స్‌క్లూజివ్ అనే సెగ్మెంట్ ఉంటుంది. అందులోకి వెళ్లి అక్కడ ఉండే ఈవ్యాలెట్ సెలక్ట్ చేసుకోవాలి. అది ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఈవ్యాలెట్ ఓపెన్ అవుతుంది. దానికి కూడా ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
అనంతరం ఈవ్యాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టాప్అప్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడే రీచార్చ్ చేయాల్సి ఉంటుంది. పదివేల వరకు ఎంతైనా రీజార్చ్ చేసుకోవచ్చు. మీరు టికెట్ బుక్ చేసుకున్న టైంలో నేరుగా ఈ బ్యాలెన్స్ నుంచే డబ్బులు కట్ అవుతాయి.
ఐఆర్‌సీటీసీ ఈ వ్యాలెట్‌లో టికెట్ ఎలా బుక్ చేయాలి
ఐఆర్‌సీటీసీ ఈ వ్యాలెట్ ఎలా రీఛార్జ్ చేయాలి
ఐఆర్‌సీటీసీ ఈ వ్యాలెట్‌లో టికెట్ ఎలా క్యాన్సిల్చే యాలి
క్యాన్సిల్ అయిన తర్వాత